చాలా కాలం గ్యాప్ తరువాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. గతంతో పోలిస్తే ఇలియానా కాస్త బొద్దుగా తయారైంది.

తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ ని ఇలియానా పెళ్లి చేసుకుందని, పెళ్లి తరువాతే ఆమె బాగా లావెక్కిందని.. ఇల్లీ బేబీ గర్భవతి అంటూ ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది ఇలియానా.

''ఆండ్రూతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు పెళ్లైందనే కాదు.. నేను గర్భవతిని అని కూడా ప్రచారం చేశారు. వాటి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాను. అయినా నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి..? నా పెళ్లి, నిశ్చితార్ధం, బంధం వంటి విషయాల గురించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు'' అంటూ చెప్పుకొచ్చింది.  

ఇవి కూడా చదవండి.. 

ఇలియానా వీడియోకి షాకింగ్ వ్యూస్!

ఇలియానాని త్రివిక్రమే పంపాడట!

ఇలియానా ఇక మారదా..?

అమర్ అక్బర్ ఆంథోనీలో ఇలియానా లుక్స్ అదుర్స్

మొదటి సారి ఇలియానా తెలుగు మాట్లాడేస్తోంది!

నడుం కోసం ఇలియానా పాట్లు!