దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఇలియానా బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి వెళ్లిపోయింది. కానీ అక్కడ ఆశించిన విజయాలు రాకపోవడంతో డీలా పడింది. చాలా కాలంలో సినిమాలు లేక ఖాళీగా గడుపుతోంది.

అలాంటి సమయంలో టాలీవుడ్ నుండి ఓ ఆఫర్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రవితేజతో కలిసి 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించింది. టాలీవుడ్ లో ఆమె నటించి చాలాకాలం అవుతుండడంతో ఆమెకి ఇక్కడ క్రేజ్ తగ్గిందేమోననే సందేహాలు కలిగాయి.

కానీ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఇలియానా ఇచ్చిన స్పీచ్ కి వస్తోన్న వ్యూస్ చూస్తుంటే ఆమెపై జనాలకు క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. కొన్ని గంటల్లోనే స్పీచ్ కి 2 మిలియన్ వ్యూస్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇలియానా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో ఉండడంతో ఈ వీడియోకి భారీ ఆదరణ దక్కిందని తెలుస్తోంది. ఇలియానా ఫ్యాక్టర్ ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్లస్ అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పుడు అమ్మడు కాస్త బొద్దుగా మారడం, పైగా సినిమాలో డబ్బింగ్ చెప్పడంతో ఆమె అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.