ఒకప్పుడు టాలీవుడ్ లో జీరో సైజ్ తో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న నటి ఇలియానాని ఇప్పుడు చూస్తోన్న వారంతా షాక్ అవుతున్నారు. బొద్దుగా తయారైన ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి షిఫ్ట్ అయిపోయింది.

అక్కడకి వెళ్ళిన తరువాత టాలీవుడ్ సినిమాలపై కామెంట్స్ చేసింది. టాలీవుడ్ ప్లో తన నడుం చూపించడానికే ఇష్టపడతారని కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెకు అవకాశాలు ఇవ్వాలనుకున్న తెలుగు హీరోలు కూడా మనకెందుకులే అని ఊరుకుండిపోయారు. అయితే ఇప్పుడు ఇలియానాకి బాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్ లో తిరిగి తన క్రేజ్ ని దక్కించుకోవాలని చూస్తోంది.

ఈ క్రమంలో ఆమెకు రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో ఇలియానా చాలా బొద్దుగా కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం సీరియస్ గా తన బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకుందట. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే సమయంలో సన్నగా కనిపించాలని గత వారం రోజులుగా లిక్విడ్ డైట్ చేస్తూ వెయిట్ తగ్గించుకునే పనిలో పడిందట.

ఈ సినిమా తరువాత మరో అవకాశం రావాలన్నా వెయిట్ తగ్గించి నాజూకుగా తయారవ్వాలని డిసైడ్ అయింది. టాలీవుడ్ లో తన నడుముకి ఫ్యాన్స్ ఉండదంతో ఇప్పుడు జీరో సైజ్ లోకి రావాలని చెమటోడుస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయో లేక ఒక్క సినిమాతో సరిపెట్టుకుంటుందో చూడాలి!