ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఇలియానా బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి మకాం మార్చింది. అక్కడ అవకాశాలు తగ్గడంతో తిరిగి టాలీవుడ్ కి రావాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటిస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరిగి పూర్వవైభవాన్ని పొందాలని అనుకుంటోంది. ఇది ఇలా ఉండగా.. ఇలియానాపై గతంలో ఓ కంప్లైంట్ ఉండేది. సినిమా షూటింగ్ మినహాయిస్తే ప్రమోషన్స్ కి మాత్రం ఇలియానా రాదు. నిర్మాతలు ఆమెను బ్రతిమిలాడి ఈవెంట్స్ కి తీసుకొస్తుండేవారు. దానికి ఈ భామ అదనపు పేమెంట్ కూడా తీసుకునేది.

డబ్బు ఇవ్వకపోతే మాత్రం ప్రమోషన్స్ కి వచ్చేదే కాదు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా విడుదలకి దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. హీరో, డైరెక్టర్ అందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఇలియానా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ఈరోజు జరగబోతున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కైనా ఆమె వస్తుందని భావిస్తున్నారు. దీనికోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తెలుగులో మొదటిసారిగా డబ్బింగ్ కూడా చెప్పిన ఈ బ్యూటీ ప్రమోషన్స్ అంటే మాత్రం దూరంగా ఉంటోంది. మరి ఈరోజు జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరవుతుందో లేక ఎప్పటిలానే లైట్ తీసుకుంటుందో చూడాలి!