దక్షిణాది అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ కి వెళ్లింది. ఇక్కడ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె అలా చేయడం పైగా అక్కడకి వెళ్లిన తరువాత తెలుగు సినిమాలను లైట్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ విషయంపై తాజాగా ఇలియానా స్పందించింది. ''తెలుగులో త్రివిక్రమ్ గారితో 'జులాయి' సినిమా చేస్తోన్న సమయంలో బాలీవుడ్ 'బర్ఫీ' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా స్టోరీ గురించి త్రివిక్రమ్ గారికి చెప్పాను. ఆయన చాలా గొప్పగా ఉంది.. తప్పకుండా చేయమని నన్ను ప్రోత్సహించారు. కాబట్టి నేను కూడా ఆ సినిమా చేయడానికి బాలీవుడ్ కి వెళ్లాను.

ఆ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో సినిమాలు ఒప్పుకోలేనంత బిజీ అయిపోయాను. ఆ టైమ్ లో రెండు, మూడు తెలుగు సినిమాలు ఛాన్స్ వచ్చినా ఒప్పుకోలేకపోయాను. దీంతో నేను తెలుగు సినిమా చేయడానికి ఇష్టపడడం లేదంటూ వార్తలు వచ్చాయి. ఇక్కడే ఆరేళ్ల పాటు సినిమాలు చేసిన నేను ఎందుకు సినిమాలు చేయనని ఎవరూ ఆలోచించలేదు.

అలానే తెలుగులో మంచి కథలు కూడా రాలేదు. కెరీర్ ప్రారంభంలో మంచి కథ అనిపిస్తే పెద్దగా ఆలోచించకుండా చేసేసేదాన్ని. కానీ ఆ తరువాత కథల ఎంపిక విషయంలో మార్పొచ్చింది. ఈ క్రమంలో కొన్ని తప్పొప్పులు జరిగి ఉండొచ్చు కానీ తప్పు చేశానని నేను బాధ పడలేదు'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

ఇలియానా ఇక మారదా..?

అమర్ అక్బర్ ఆంథోనీలో ఇలియానా లుక్స్ అదుర్స్

మొదటి సారి ఇలియానా తెలుగు మాట్లాడేస్తోంది!

నడుం కోసం ఇలియానా పాట్లు!