సన్నని నడుముతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన బ్యూటీల్లో ఇలియానా టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ఈ బ్యూటీ చివరగా దేవుడు చేసిన మనుషులు సినిమా ద్వారా మళ్ళి కనిపించింది. ఇక చాలా కాలం తరువాత అమర్ అక్బర్ అంథోని సినిమా ద్వారా టాలీవుడ్ తెరపై మళ్ళి సరికొత్తగా దర్శనమిచ్చింది. 

అయితే ఇన్నేళ్ల కెరీర్ లో ఇలియానా ఎప్పుడు తెలుగు డబ్బింగ్ చెప్పుకోలేదు. అయితే మొదటి సారి ఆమె ఈ AAA సినిమా కోసం తన పాత్రకు తన గొంతునే ఇవ్వబోతోంది. దర్శకుడు శ్రీను వైట్ల పాత్రకు దృష్టిలో ఉంచుకొని సొంతంగా డబ్బింగ్ చెబితేనే బావుంటుందని తెలుపడంతో నాలుగు రోజుల పాటు కష్టపడి అమ్మడు తెలుగు పదాలతో డబ్బింగ్ థియేటర్ లో కష్టపడిందట. 

సినిమాలో ఇలియానా పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఇక రవితేజతో ఇలియానకు ఇది నాలుగవ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 16న రిలీజ్ కానుండగా నవంబర్10వ తేదీన ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.