నెగెటివ్ రోల్స్ లో నేను బాగుంటాను.. పవన్ కళ్యాణ్ హీరోయిన్

i would love to do negative roles says supriya
Highlights

ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వాలనుకోవడానికి కారణం అడివి శేష్ అని చెప్పుకొచ్చింది. 'అడివి శేష్ నాకు మంచి స్నేహితుడు. తను కథ చెప్పాడు. పాత్ర గురించి వివరించాడు. అయితే ఇంత గ్యాప్ వచ్చిన తరువాత నటించగలనా..? లేదా..? అని నాకే డౌట్ వచ్చింది. అందుకే స్క్రీన్ టెస్ట్ చేయమని అడిగాను

పవన్ కళ్యాణ్ నటించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది నాగార్జున మేనకోడలు సుప్రియ. ఆ తరువాత మాత్రం హీరోయిన్ గా కొనసాగించలేదు. వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సుప్రియ ప్రస్తుతం అన్నపూర్ణ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ నాగార్జునకు సహాయంగా ఉంటోంది. చాలా కాలం తరువాత మళ్లీ ఆమె 'గూఢచారి' సినిమా ద్వారా వెండితెరపై కనిపించింది.

ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో చక్కటి నటన కనబరిచింది సుప్రియ. రివ్యూలలో కూడా ఆమె పాత్రను కొనియాడుతున్నారు. ఈ క్రమంలో నటిగా బిజీ అవ్వాలని నిర్ణయించుకుందట. ఇకపై సీరియస్ గా యాక్టింగ్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించింది. మంచి పాత్ర, కథ వస్తే తప్పకుండా నటిస్తానని, విలన్ రోల్స్ బాగా పోషించగలనని.. అలంటి పాత్రలొస్తే అభ్యంతరం చెప్పననిఅంటోంది.

ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వాలనుకోవడానికి కారణం అడివి శేష్ అని చెప్పుకొచ్చింది. 'అడివి శేష్ నాకు మంచి స్నేహితుడు. తను కథ చెప్పాడు. పాత్ర గురించి వివరించాడు. అయితే ఇంత గ్యాప్ వచ్చిన తరువాత నటించగలనా..? లేదా..? అని నాకే డౌట్ వచ్చింది. అందుకే స్క్రీన్ టెస్ట్ చేయమని అడిగాను. తెరపై చూసుకున్న తరువాత తృప్తిగా అనిపించింది. అందుకే సినిమా చేయడానికి ఒప్పుకున్నా' అని వెల్లడించింది.  

loader