Asianet News TeluguAsianet News Telugu

సెక్సీ బ్యూటీతో క్రేజీ హీరో.. ఫ్లోర్ అదిరిపోవాల్సిందే!

ఈ ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాలలో 'వార్' ఒకటి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. 

Hrithik-Vaani to dance on party track of the year in WAR
Author
Hyderabad, First Published Sep 2, 2019, 6:32 PM IST

ఈ ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాలలో 'వార్' ఒకటి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. 

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మధ్య తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలవనున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని తెలియజేసింది. 

ఈ చిత్రంలో హాట్ బ్యూటీ వాణి కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాణి కపూర్, హృతిక్ రోషన్ మధ్య కళ్ళు చెదిరే పార్టీ సాంగ్ ని చిత్రీకరించారు. ఈ సాంగ్ లో హృతిక్, వాణి కలసి చేసే డాన్స్ ఆకట్టుకుంటుందని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. వాణి కపూర్ తన నృత్యం, అందంతో కట్టిపడేస్తుంది. ఇక హృతిక్ ఎలా డాన్స్ చేస్తాడో చెప్పనవసరం లేదు అని సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. 

ఈ పార్టీ నంబర్ థియేటర్స్ లో కేక పెట్టించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios