సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమిళంలో ప్రస్తుతం క్రేజీ హీరో. విలక్షణ నటనతో ఎందరో అభిమానులని సొంతం చేసుకున్నాడు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ధనుష్ 'అసురన్ చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. 

వెట్రి మారన్ దర్శత్వంలో తెరకెక్కిన అసురన్ మూవీ తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రంలో ధనుష్ యువకుడిగా, మధ్య వయస్కుడిగా నటనతో మెప్పించాడు. ఇదిలా ఉండగా ఈ శుక్రవారం ధనుష్ మరో మూవీతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. 

క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శత్వంలో ధనుష్, మేఘా ఆకాష్ జంటగా నటించిన తూటా చిత్రం నవంబర్ 29న రిలీజ్ కానుంది. కానీ ఈ చిత్రంపై ఎలాంటి బజ్ లేదు. దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ చిత్రం వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు మోక్షం లభించి శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 

ధనుష్ కూడా ఈ చిత్రాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడా ప్రచార కార్యక్రమాలు లేవు. తన సినిమా రిలీజవుతున్న విషయాన్ని ధనుష్ సోషల్ మీడియాలో కూడా పేర్కొనలేదు. ధనుష్ ఈ చిత్రంపై ఎంత అనాసక్తితో ఉన్నాడనే విషయం అర్థం అవుతోంది. 

'నువ్వు డైరెక్టర్ అయితే మనిషిని చంపేస్తావ్'.. హీరోలపై ఛోటా కె నాయుడు కామెంట్స్!

గౌతమ్ మీనన్ కూడా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరు. అసురన్ చిత్రం ఘనవిజయం సాధించడం 'తూటా' నిర్మాతలకు కాస్త ఊరటనిచ్చే అంశం. అసురన్ మూవీ తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటించనున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.