సినిమా నిర్మాణంలో సినిమాటోగ్రఫీ అనేది చాలా కీలకమైన విభాగం. దర్శకుడి ఆలోచనలకు ఒక రూపాన్ని తీసుకువచ్చేది సినిమాటోగ్రఫరే. కెమెరామెన్ గా ఛోటా కె నాయుడు అగ్ర స్థానానికి చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలందరికీ ఛోటా కె నాయుడు కెమెరామెన్ గా పనిచేశారు. 

టాలీవుడ్ లో ఛోటా కె నాయుడుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా ఛోటా కె నాయుడు కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలీతో ఛోటా కె నాయుడు అనేక విషయాలు పంచుకున్నారు.ఛోటా కె నాయుడు మాట్లాడుతూ కెమెరామెన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశా. దర్శకత్వం చేయాలనే కోరిక కూడా ఉంది. కానీ దర్శత్వం అనేది చాలా భాద్యతాయుతమైన జాబ్ అని ఛోటా అన్నారు. 

ఇతర రాష్ట్రాల నుంచి కెమెరామెన్ లు టాలీవుడ్ లో ఎక్కువవుతున్నారు. అందువల్ల మీకు అవకాశాలు తగ్గుతున్నాయా అని అలీ ప్రశ్నించగా ఛోటా సమాధానం ఇచ్చారు. అది నిజమే. టాలీవుడ్ లో హీరోల డామినేషన్ ఎక్కువైపోయింది. హీరోల వల్లే తెలుగు కెమెరామెన్ లకు ప్రస్తుతం పని లేకుండా పోయింది. 

తెలుగు కెమెరామెన్ వర్క్ లో క్వాలిటీ ఉండదనే అభిప్రాయం హీరోల్లో ఉంది. కానీ ఇతరాష్ట్రాల నుంచి వస్తున్న కెమెరామెన్ లకు కనీసం హీరోని సరిగా చూపించడం కూడా చేతకావడం లేదు. ఇక తాను భవిష్యత్తులో దర్శత్వం చేసే విషయంపై ఛోటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన భార్య గురించి ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. 

నేను ఏ చిత్రానికి పనిచేసినా చాలా బాధ్యతాయుతంగా ఉంటాను. సినిమా రిలీజ్ కు ముందురోజు నుంచి విడుదలైన మూడు రోజులవరకు చాలా టెన్షన్ కు గురవుతా. సినిమా విజయం సాధిస్తుందా లేదా.. విజయం సాధిస్తే ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే ఒత్తిడి నాపై ఉంటుంది. ఒక వేళ ఫ్లాప్ అయితే ఆరోజు మా ఇంట్లో ప్లేట్లు కానీ, మరే ఇతర వస్తువులు కానీ పగిలిపోతాయి. 

త్రివిక్రమ్ కి దిల్ రాజు దూరం.. మరి పవన్ ఒప్పుకుంటాడా..?

దీని గురించి నా భార్య ఓ మాట చెప్పింది. నువ్వు కేవలం కెమెరామెన్ గా ఉంటేనే ఇంత హంగామా చేస్తున్నావు.. ఒక వేళ నువ్వు డైరెక్టర్ అయితే మనుషుల్ని చంపేస్తావు.. దయచేసి నువ్వు దర్శకుడు కావద్దు అని తనతో చెప్పినట్లు ఛోటా సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్న సందీప్ కిషన్ ఛోటా కె నాయుడి మేనల్లుడే.