నేను అమ్మాయినైతే.. సూపర్ స్టార్ ని రేప్ చేసేవాడ్ని: ప్రముఖ దర్శకుడు

Had I been a girl, I'd have raped Mammootty says director mysskin
Highlights

ఈ సినిమాలో మమ్ముట్టి కాకుండా మరో హీరో నటించి ఉంటే ఓవరాక్షన్ చేసేవాళ్లు. కానీ మమ్ముట్టి చాలా బాగా నటించారు. ప్రేక్షకులు ఆయన్ను చూస్తూ ఉండిపోతారు. నేను అమ్మాయిగా పుట్టుంటే మమ్ముట్టిని ప్రేమించేవాడిని అతడ్ని రేప్ చేసేవాడిని కూడా

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు మిస్కిన్ కాస్త తేడా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మమ్ముట్టి నటించిన 'పెరాన్బు' సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్.. మమ్ముట్టిని పొగిడే ప్రయత్నంలో మమ్ముట్టి ఆడపిల్లైతే అత్యాచారం చేసేవాడిని అంటూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.

''ఈ సినిమాలో మమ్ముట్టి కాకుండా మరో హీరో నటించి ఉంటే ఓవరాక్షన్ చేసేవాళ్లు. కానీ మమ్ముట్టి చాలా బాగా నటించారు. ప్రేక్షకులు ఆయన్ను చూస్తూ ఉండిపోతారు. నేను అమ్మాయిగా పుట్టుంటే మమ్ముట్టిని ప్రేమించేవాడిని అతడ్ని రేప్ చేసేవాడిని కూడా. అసభ్యకరంగా మాట్లాడుతున్నానని అనుకోకండి.. మమ్ముట్టి నటన నాకెంత నచ్చిందో చెప్పడానికే ఇలా అన్నాను'' అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఒక సూపర్ స్టార్ పై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సోషల్ మీడియాలో మిస్కిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమ్ముట్టిపై అలాంటి కామెంట్స్ చేస్తుంటే.. అక్కడున్నవారు నవ్వడాన్ని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు.

loader