Asianet News TeluguAsianet News Telugu

కోరుకున్నట్లు గంగవ్వ ఇంటికి...ఆమె కల నెరవేరుస్తానన్న నాగార్జున

నామినేషన్స్ లో లేకపోయినా గంగవ్వ హౌస్ నుండి బయటికి పంపించాడు బిగ్ బాస్. ఆరోగ్యం సరిగా లేదని, తిండికి, నిద్రకు ఇబ్బంది పడుతున్నానని గంగవ్వ చెప్పడంతో నాగార్జున బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసి ఆమె కోరికను అనుమతించారు. 
 

gangavva walks out of big boss house ksr
Author
Hyderabad, First Published Oct 10, 2020, 11:48 PM IST

నాగార్జున ఈ వారం కూడా ఇంటి సభ్యులకు క్లాస్ తీసుకున్నారు. తెలుగులో మాట్లాడక పోవడం, మైక్ సరిగా ధరించపోవడం వంటి విషయాలు పాటించనందుకు శిక్షగా నిద్రపోతున్న సభ్యులను నాగార్జున లేపాడు. ఇక ఇంటి కెప్టెన్ గా సోహైల్ వీటిపై కూడా దృషి సారించాలి అన్నాడు. పుచ్చ పగిలిద్ది అనే మాట వాడిన మెహబూబ్ ని మందలించాడు. 


ఎప్పటిలాగే మోనాల్, అఖిల్ మధ్య రొమాన్స్ కొనసాగింది. సోపాలో పడుకున్న మోనాల్ చేతిని పట్టుకొని అఖిల్ మాట్లాడుతుండగా, అభిజిత్ వచ్చాడు. అభిజిత్ ని చూసిన మోనాల్ అతనికి స్మైల్ ఇవ్వడం జరిగింది. నా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అఖిల్ మోనాల్ తో అన్నాడు. అభిజిత్ కి కూడా మోనాల్ స్పందించడం అఖిల్ కి నచ్చడం లేదని అర్థం అయ్యింది. నీ బాధ ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని మోనాల్ అనగా, అసహనంగా అక్కడి నుండి వెళ్లిపోవడానికి అఖిల్ ప్రయత్నించాడు.

వెళుతున్న అఖిల్ ని వెళ్ళొద్దని మోనాల్ రొమాంటిక్ గా ఆపింది. నాకు మొన్న హెల్త్ బాగాలేదు. అప్పుడు నువ్వు నా పక్కన కాసేపు కూర్చుంటే చాలా హ్యాపీగా ఫీలయ్యానని, నువ్వు నా మెడిసిన్ అని చెప్పింది. దానికి అఖిల్ సమాధానంగా మెడిసిన్ ఎక్సపైర్ అయిపోయింది అన్నాడు.

గంగవ్వ ఇంటి నుండి బయటికి రావడం అనేది శనివారం ఎపిసోడ్ లో సంచలనం అనాలి. ఆమె ఆరోగ్య కారణాల రీత్యా బయటికి పంపాలని బిగ్ బాస్ ని కోరుకుంది. నాగార్జున బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసి, గంగవ్వను హౌస్ నుండి బయటికి పంపించేశారు. 

దీనితో ఇంటి సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఆమె వెళ్ళిపోతున్నందుకు కన్నీరు పెట్టుకున్నారు. నాగార్జునతో పాటు బిగ్ బాస్ వేదిక పంచుకున్న గంగవ్వ ఇంటి సభ్యుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గంగవ్వ బిగ్ బాస్ లోకి రావడానికి కారణం ఇల్లు కట్టుకోవాలనే కల. ఆ కల నేను నెరవేరుస్తా అని నాగార్జున హామీ ఇచ్చారు. ఇక గంగవ్వ అఖిల్ ని సేవ్ చేయగా, మరో ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios