Asianet News TeluguAsianet News Telugu

‘పెళ్లిసందD’ హీరోయిన్ శ్రీలీలా తల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే?

‘పెళ్లిసందD’ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ సందర్భంగా తాజాగా ఆమె తల్లి స్వర్ణలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 

FIR registered against Heroine Sreeleelas mother, because?
Author
First Published Oct 7, 2022, 1:20 PM IST

యంగ్ హీరోయిన్ శ్రీలీలా తొలిచిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బెస్ట్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో భారీగానే ఆఫర్లు అందుకుంటోంది. కేరీర్ పరంగా శ్రీలీలాకు ఎలాంటి ఢోకా లేకపోయినా కుటుంబ పరంగా సమస్యలు తలెత్తుతున్నాయి.  శ్రీలీలా 2001లో జూలై 14న శ్రీలీలా యూనైటెడ్ స్టేట్స్ లో గైనకాలజిస్ట్ సర్ణలత, బిజినెస్ మెన్ సుభాకర రావు దంపతులకు జన్మించింది. ఆ తర్వాత బెంగళూరులో పెరిగింది. 

అయితే శ్రీలీలా తల్లి స్వర్ణలత ప్రస్తుతం తన భర్త సుభాకర రావుతో కలిసి ఉండటం లేదు. శ్రీలీలా పుట్టకముందు నుంచే విడిగా ఉంటోంది. గతంలో వీరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  మరోవైపు వీరి విడాకుల సంబంధించిన పిటిషన్ పైనా కోర్టులో నెటికీ విచారణ  కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీలా తల్లి స్వర్ణలతపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. కొరమంగళలో ఉన్న తన అపార్ట్ మెంట్ లోకి భార్య సర్వర్ణలత అక్టోబర్ 3న చొరబడిందని సుభాకర్ రావు ఆరోపించారు.  తాజాగా అడుగుడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. 

స్పందించిన పోలీసులు స్వర్ణలతపై ఎఫ్ఐఆర్ నమోద చేశారు. విచారణ చెపడుతున్నట్టుగా సమాచారం.  గతంలోనూ స్వర్ణలతపై  మరో కేసు నమోదై, యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అలియన్స్ యూనివర్సిటీ వివాదంలో స్వర్ణలతపై ఏ2 నిందితురాలిగా కేసు నమోదైంది. ప్రస్తుతం బెయిల్ లో ఉండగానే.. మరో కేసు కూడా నమోదు కావడం గమనార్హం. ఇక శ్రీలీలా మాత్రం తన కేరీర్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన ‘ధమాకా’లో నటిస్తోంది. మరో  నాలుగైదు ప్రాజెక్టులు కూడా యంగ్ బ్యూటీ లైనప్ లో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios