గత వారం ఎలిమినేషన్స్ విషయంలో కొంత హైడ్రా నడిచింది. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన తొమ్మది మంది ఇంటి సభ్యులలో కరాటే కళ్యాణ్ ఎలిమినేటై హౌస్ ని వీడడం జరిగింది. ఇక నెక్స్ట్ డే జరిగిన ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఉత్కంఠ మధ్య దేత్తడి హారిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. నాగార్జున తన వస్తువులు సర్దుకోవలసినదిగా చెప్పడంతో హారిక తన బ్యాగేజ్ తీసుకొని, హౌస్ ని వీడడానికి సిద్ధం అయ్యింది. 

కంటెస్టెంట్స్ హగ్స్, ముద్దులతో హరికకు సెండ్ ఆఫ్ చెప్పగా కొంచెం ఎమోషనల్ ఎపిసోడ్ నడిచింది. ఇక డోర్ తీయడమే తరవుతాయి, హారిక హౌస్ నుండి వెళ్ళిపోనుందన్న తరుణంలో నాగ్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. హారిక ఎలిమినేషన్ అంతా ఫేక్ అన్నారు. హారిక హౌస్ నుండి ఎలిమినేట్ కాలేదు. కేవలం మీకు ఎలిమినేషన్ అనేది ఎంత సీరియస్ విషయమో చెప్పడానికి ఇలా చేశాం అన్నారు. 

హౌస్ లోని ఇంటి సభ్యులలో చాలా మంది ఎలిమినేషన్ అనేది సీరియస్ గా తీసుకోవడం లేదని, జాగ్రత్తగా గేమ్ ఆడాలని హెచ్చరించారు. ఐతే ఈ ఫేక్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో అనుకోకుండా హారిక పట్ల ప్రేక్షకులకు సానుభూతి కలిగిందని తెలుస్తుంది. ఒక్కసారి చివరి వరకు వెళ్లి తప్పించుకున్న హారికను ప్రేక్షకులు మరోమారు ఎలిమినేట్ చేయాలని అనుకోకపోవచ్చు. అలాగే ఎలిమినేషన్ తరువాత హారిక ప్రవర్తన కూడా హుందాగా ఉండంతో పాటు, స్పోర్టివ్ గా తీసుకుంది. 

ఈ అంశాలన్నీ హరికకు కలిసొస్తాయని అందరూ అంటున్నారు. ఇక వచ్చే వారం ఎలిమినేషన్ లో కూడా హారిక ఉన్నారు. ఎలిమినేషన్ కొరకు మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ కాగా మెహబూబ్, ఆరియానా, లాస్య, నాగవల్లి, కుమార్ సాయి, మోనాల్ మరియు హారిక ఉన్నారు. ఈ సభ్యులలో  ఒకరు బిగ్ బాస్ హౌస్ ని వీడనున్నారు