Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్, శర్వానంద్ ...ఒకే టైటిల్, ప్రెండ్షిప్ ప్లస్ అవుతోంది!

ఒకే టైటిల్ ఆలోచన ఒకే సమయంలో ఇద్దరికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు వెనక్కి తగ్గి వేరొకరికి ఆ టైటిల్ ఇచ్చేస్తూంటారు.

dil raju wants to change '96' telugu remake title
Author
Hyderabad, First Published Apr 9, 2019, 9:26 AM IST

ఒకే టైటిల్ ఆలోచన ఒకే సమయంలో ఇద్దరికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు వెనక్కి తగ్గి వేరొకరికి ఆ టైటిల్ ఇచ్చేస్తూంటారు. ఈ టైటిల్ విషయంలో గతంలో వివాదాలు సైతం జరిగాయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి..టైటిల్ విషయంలో మీడియాకు,కోర్ట్ లకు ఎక్కుతూనే ఉన్నాయి. అయితే తాజాగా శర్వానంద్, ప్రభాస్ ఇద్దరూ ఒకే తరహా టైటిల్ తో ముందుకు వెళ్ళనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే టైటిల్ అనుకోవటంతో వచ్చిన సమస్య ఇది.

ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి జాన్ అనే టైటిల్ అనుకున్నారు. అమూర్ అనే టైటిల్ అనుకున్నా ..ఫైనల్ గా జాన్ కే ఫిక్సైంది యూనిట్. దాంతో త్వరలో జాన్ టైటిల్ తో ఫస్ట్ లుక్ వదిలే ఆలోచనలో ఉంది టీమ్. అదే సమయంలో దిల్ రాజు , శర్వానంద్ కాంబినేషన్ లో రూపొందుతున్న  ’96’ రీమేక్ చిత్రానికి జాను అనే టైటిల్ ని దర్శక,నిర్మాతలు అనుకున్నారు.

ఇప్పుడు రెండు టైటిల్స్ ఒకే రకంగా ఉండటంతో.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సిన పరిస్దితి ఏర్పడింది. దానికి తోడు శర్వానంద్, ప్రభాస్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ నేపధ్యంలో ప్రభాస్ కే ఆ టైటిల్ ని వదిలేద్దామని శర్వా ఫిక్సైయ్యారట. అయితే నీ సినిమాకు అదే యాప్ట్ టైటిల్ అయితే వాడుకో అని ప్రభాస్ చెప్తున్నారట. అయితే దిల్ రాజు తమ సినిమాకు వేరే టైటిల్ చూస్తామని, మీరు ఆ టైటిల్ తో ముందుకు వెళ్లిపోండని చెప్పారట. అదీ హీరోల ఫ్రెండ్షిప్ వల్ల వచ్చే లాభం. 

Follow Us:
Download App:
  • android
  • ios