- Home
- Entertainment
- ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్, నిఖిల్ కొత్త ఇల్లు ఎలా ఉందో తెలుసా?
ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్, నిఖిల్ కొత్త ఇల్లు ఎలా ఉందో తెలుసా?
మొత్తానికి తన కల నెరవేర్చుకున్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్. సొంత ఇంటి కలను నిజం చేసుకున్నాడు. రాజభవనంలాంటి ఇంటిని కట్టుకుని,, రీసెంట్ గా గృహప్రవేశం కూడా చేశాడు.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు..
తెలుగు ఆడియన్స్ ను అలరించిన కన్నడ నటులలో నిఖిల్ కూడా ఒకడు. టీవీ సీరియల్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నిఖిల్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. టీవీ ఆర్టిస్ట్ గా తెలుగులో ప్రతీ ఇంటికి చేరువయ్యాడు నిఖిల్. ఆ ఇమేజ్ అతన్ని బిగ్ బాస్ వరకూ నడిపించింది. బిగ్ బాస్ తరువాత మరింత పాపులర్ అయ్యాడు హీరో.
బిగ్ బాస్ హౌస్‌లో విచిత్ర పరిణామాలు..
బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ కు విచిత్ర పరిణామాలు ఎదురయ్యాయి. ప్రతీ సీజన్ లో తెలుగు బిగ్ బాస్ లో ఒకరైనా కన్నడ యాక్టర్ ఉండటం కామన్.. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మాత్రం ఎక్కువమంది కన్నడవాళ్ళతో నింపేశారు. దాంతో గత సీజన్ల కంటే ఆ సీజన్ చాలా భిన్నంగా నడిచింది. తెలుగు వర్సెస్ కన్నడ సెంటిమెంట్ కూడా ఈ సీజన్‌లో ప్రాధాన్యం పొందింది. అయినప్పటికీ, నిఖిల్ ఆటతీరును మెచ్చిన తెలుగు ప్రేక్షకులు ఆయనను విజేతగా నిలిపారు.
నాగార్జునతో తన లక్ష్యం చెప్పుకున్న కింగ్..
బిగ్ బాస్ షో ద్వారా నిఖిల్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. హౌస్‌లో ఉన్న సమయంలో ఒక వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఆయనను ఒక ప్రశ్న అడిగారు. “నువ్వు ఒకవేళ ప్రైజ్ మనీ గెలుచుకుంటే దానిని ఏమి చేస్తావు?” అని అడగగా, నిఖిల్ స్పందిస్తూ “ ఆ డబ్బుతో మాకు ఉన్న అప్పులు తీర్చుకుని, నా తల్లిదండ్రుల పేర్ల మీద ఒక మంచి ఇల్లు కట్టించాలి” అని అన్నాడు. నిఖిల్ మాటలకు నాగార్జున కూడా ఫిదా అయ్యాడు.
కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్..
ఇప్పుడు ఆ కోరికను నెరవేర్చినట్లు తెలుస్తోంది. తాజాగా నిఖిల్ తన తల్లిదండ్రులతో కలిసి కొత్తగా నిర్మించిన ఇంటిలో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఆ చిత్రాల్లో నిఖిల్‌తో పాటు ఆయన సోదరుడు దిశాంక్ మరియు తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

