Asianet News TeluguAsianet News Telugu

పల్లె జీవనాన్ని గుర్తు చేస్తూ...సరికొత్తగా చిత్ర పటం ఫస్ట్ లుక్

చిత్రపటం పేరుతో దర్శకుడు బండారు దానయ్య కవి ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు.  పాతకాలపు కుర్చీ, కుర్చీ మీద ఒక టవల్, పక్కన స్టూల్, స్టూల్ మీద పాతకాలపు రాగి చెంబు బ్యాకగ్రౌండ్ లో పొలాలు అచ్చమైన పల్లెటూరిని తలపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆహ్లాదంగా ఉంది. 

chitra patam first look rises curiosity ksr
Author
Hyderabad, First Published Sep 23, 2020, 12:28 PM IST

బండారు దానయ్య కవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “చిత్రపటం” సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. పల్లెటూరు నేపధ్యంలో సినిమా తెరకేక్కుతున్నట్టు ఆ లుక్ చూస్తూనే అర్ధమవుతుంది. పాతకాలపు కుర్చీ, కుర్చీ మీద ఒక టవల్, పక్కన స్టూల్, స్టూల్ మీద పాతకాలపు రాగి చెంబు బ్యాకగ్రౌండ్ పొలాలను చూపిస్తూ డిజైన్ చేసిన ఈ లుక్ చూస్తుంటే ఒక స్వచ్ఛమైన పల్లెటూరులో కొన్ని అద్భుతమైన పాత్రల సమూహంతో సినిమా కథ నడిసేలా అర్ధమవుతుంది. 

ఈ సందర్భంగా ఎన్నో సూపర్ హిట్టు సినిమాలకు చక్కటి సాహిత్యం అందించి, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బండారు దానయ్య కవి మాట్లాడుతూ "విడుదల చేసిన ఫస్ట్ లుక్ తోనే మా చిత్రపటం సినిమాకు మంచి స్పందన దక్కుతుంది. అన్ని వైపుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు పరిచయం ఉన్న పెద్ద దర్శకులు, నిర్మాతలు సైతం ఫోన్ చేసి ఫస్ట్ లుక్ చాలా బాగుందని మెచ్చుకొన్నారు. ప్రఖ్యాత దర్శకులు బాపు గారు, భారతిరాజా, సత్యజిత్ రే సినిమాల స్టైల్ మేకింగ్ లా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉందని అన్నారు.

ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రేక్షకులు సైతం చర్చించుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ లుక్ ని వైరల్ చేస్తున్నారు, మాకు అది చాలా సంతోషంగా ఉంది. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మిమ్మల్ని ఎంత ఆకట్టుకుందో, కథ మరియు సినిమా కూడా ప్రేక్షకులని అంతే స్థాయిలో ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో అంతా పెద్ద నటినటులు నటిస్తున్నారు, మీరు వాళ్ళని మర్చిపోయి, ఈ సినిమా లో వారు పోషించిన పాత్రలే ప్రేక్షకులకు గుర్తుంటాయి, మంచి కంటెంట్ ఉన్న కథ కాబట్టి నిర్మాత కూడా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మిస్తున్నారు. అని తెలిపారు."ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు పుప్పాల శ్రీధర్ రావు నిర్మాత.  సాహిత్యం, సంగీతం, మాటలు, రచన, దర్శకత్వం బండారు దానయ్య కవి.
 

Follow Us:
Download App:
  • android
  • ios