Asianet News TeluguAsianet News Telugu

తనకు జరిగిన అన్యాయంపై ఫైమా అసహనం.. ఆమె ఆటని తొక్కేస్తున్నారా..

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీకి కంటెండర్ టాస్క్ జరిగింది.

captaaincy contender task became tough in bigg boss 6
Author
First Published Nov 16, 2022, 11:14 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీకి కంటెండర్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ ఊహించని విధంగా మెలిక పెట్టారు. 

గార్డెన్ లో బిబి ట్రాన్స్ పోర్ట్ అనే వెహికల్ ఆగి ఉంటుంది. ఆ వెహికల్ ని ఎవరైతే ముందుగా చేరుకొని హార్న్ మోగిస్తారో వారు కెప్టెన్సీ టాస్క్ పోటీకి ఎంపిక అవుతారు. మిగిలిన వాళ్లంతా కలసి కెప్టెన్సీ పోటీకి తమలో ఎవరు అర్హులు కారో ఇద్దరినీ ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాలి. ఆ ఇద్దరిలో ఒకరిని ముందుగాకెప్టెన్సీ టాస్క్ కి ఎంపికైన వ్యక్తి తొలగించి.. మిగిలిన వ్యక్తిని మరో ఛాన్స్ ఇస్తారు. 

అలా తొలి రౌండ్ లో ఆది రెడ్డి ముందుగా హార్న్ మోగించి కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారు. ఇక్కడ బిగ్ బాస్ ఊహించని విధంగా మెలిక పెట్టారు. ముందుగా హార్న్ మోగించిన వారు కొంత డబ్బు వెచ్చించి కెప్టెన్సీ కంటెండర్ ప్లేస్ ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎంత వెచ్చిస్తారో అంత మొత్తం బిగ్ బాస్ ప్రైజ్ మనీలో తగ్గిస్తారు. కెప్టెన్సీ కంటెండర్ కోసం ఆది రెడ్డి రూ లక్ష వెచ్చించారు. 

మొదటి రౌండ్ లో ఫైమాని తొలగించి రోహిత్ కి ఛాన్స్ ఇచ్చారు.తొలి రౌండ్ లోనే తనని తొలగించడం తో ఫైమా అసహనం వ్యక్తం చేసింది. తన గేమ్ ఎలా నిరూపించుకోవాలి.. నా గేమ్ ని తోక్కేస్తున్నారు అంటూ ఆమె బిగ్ బాస్ తో ఆవేదన వ్యక్తం చేసింది.  ఇలా రౌండ్స్ గడిచే కొద్దీ ఒక్కొక్కరు ఎంపిక అవుతూ.. మరొకరు తొలగిపోతూ ఉంటారు. అన్ని రౌండ్స్ పూర్తయ్యే సరికి కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనయ అర్హత సాధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios