గత ఏడాది బాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మీటూ ఉద్యమం వల్ల బాలీవుడ్ ప్రముఖుల కొందరు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. నానా పాటేకర్ తో పాటు కొందరు దర్శకులు, నటులు అవకాశాలు కోల్పోయారు. 

ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ 'ది లవ్ లాఫ్ లైఫ్' అనే షోలో పాల్గొన్నారు. ఈ షోలో రవీనా టాండన్ మీటూ ఉద్యమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీటూ ఉద్యమం వల్ల ఎంతో కొంత మార్పు వచ్చిందని రవీనా టాండన్ పేర్కొంది. 

90 దశకంలో సోషల్ మీడియా లేకపోవడం చాలా విచారకరం. ఆరోజుల్లో సెలెబ్రిటీలపై ఏదైనా కాట్రవర్సీలు వస్తే పత్రికల్లో వచ్చిన వార్తలనే ప్రజలు నిజమని నమ్మేవారు. మీ గురించి మేం చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. కాంట్రవర్సీలపై మా అభిప్రాయం చెప్పేందుకు మరో అవకాశం లేకుండా పోయింది. 

అప్పుడే సోషల్ మీడియా ఉండి ఉంటె.. ఎందరో జీవితాలని నేనే బయటపెట్టేదాన్ని అని రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అందాజ్ అప్నా అప్నా, దుల్హే రాజా లాంటి విజయవంతమైన చిత్రాలతో రవీనాటాండన్ 90వ దశకంలో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ మధ్యన సాహో ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ మాట్లాడుతూ తన ఫస్ట్ క్రష్ రవీనా టాండన్ అని తెలిపాడు.