బిగ్ బాస్2: కౌశల్ కి నాని వార్నింగ్.. కౌశల్ ఆర్మీ ఏం చేస్తుందో?

bigg boss2: nani warning to kaushal
Highlights

హౌస్ లో కౌషల్ కి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ చేసినా.. ఆఖరికి హోస్ట్ నాని.. కౌశల్ ని ఏమైనా కామెంట్ చేసినా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు

తమ అభిమాన నటుడు ఏం చేసినా.. అది మాత్రమే కరెక్ట్ అని భావించే వారు చాలా మంది ఉంటారు. ఒకవేళ సెలబ్రిటీ తప్పు చేసినా.. అభిమానులు మాత్రం అలా చూడరు. వారి అభిమానం అలాంటిది మరి. ఇప్పుడు కౌశల్ ఆర్మీ కూడా అతడికి అలాంటి సపోర్టే ఇస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికి కౌశల్ కి సోషల్ మీడియాలో క్రేజ్ బాగా పెరిగింది.

ఎంతగా అంటే అతడికోసం ఓ ఆర్మీ తయారైంది. హౌస్ లో కౌషల్ కి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ చేసినా.. ఆఖరికి హోస్ట్ నాని.. కౌశల్ ని ఏమైనా కామెంట్ చేసినా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో నాని కౌశల్ చేసిన తప్పుని వేలెత్తి చూపారు. గత వారం జరిగిన టాస్క్ లో దీప్తిని ప్లాంట్ మీద నుండి నెట్టమని నందినికి సలహా ఇచ్చింది కౌశల్ కానీ తను అలా చేయలేదని కవర్ చేసుకున్నాడు కౌశల్.

దీంతో ఆ క్లిప్ ని వేసి చూపించిన నాని అతడికి క్లాస్ పీకారు. 'నువ్వు గేమ్ ఆడే తీరు చూసి బయట నిన్ను చాలా మంది అభిమానిస్తున్నారు. కానీ ఇది బిగ్ బాస్ హౌస్ నిన్ను ఎంత త్వరగా అభిమానిస్తారో.. అంతే త్వరగా ద్వేషించే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా లేకపోతే ఏమైనా జరగొచ్చు అంటూ' కౌశల్ కి వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడు కౌశల్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!

loader