అందరి ముందు బట్టలు విప్పిన తేజా... సిగ్గుతో కళ్ళు మూసుకున్న అమ్మాయిలు!
బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. నలుగురు చొప్పున హౌస్ మేట్స్ బిగ్ బాస్ మారథాన్ టాస్క్స్ లో పోటీపడుతున్నారు.

మొదటి టాస్క్ లో ప్రియాంక, శోభా, అమర్, తేజా పోటీపడ్డారు. వీరు సంచాలక్ చూపించే వస్తువు నీళ్లల్లో మునుగుతుందో? తేలుతుందో? చెప్పాలి. ఈ గేమ్ లో ప్రియాంక గెలిచింది కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. అమర్ చివరి స్థానంలో నిలిచి రేసు నుండి తప్పుకున్నాడు. తేజా, శోభా రేసులో ఉన్నారు. తర్వాత టాస్క్ లో పల్లవి ప్రశాంత్, గౌతమ్, యావర్, రతిక పాల్గొన్నారు. ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచి సెకండ్ కంటెండర్ అయ్యాడు.
రతిక రేసు నుండి తప్పుకుంది. యావర్, గౌతమ్ రేసులో నిలిచారు. మూడో టాస్క్ లో అర్జున్, భోలే, అశ్విని, సందీప్ పోటీపడ్డారు. సందీప్ గెలిచి కంటెండర్ అయ్యాడు. భోలే రేసు నుండి తప్పుకున్నాడు. అర్జున్, అశ్విని రేసులో ఉన్నారు. దీంతో బిగ్ బాస్ అర్జున్, శోభా, తేజా, అశ్విని, యావర్ లలో ఒకరు కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంది. ముగ్గురి చొప్పున టాస్క్ లలో పాల్గొనాలి అన్నాడు.
మొదటి టాస్క్ లో ఎక్కువ బట్టలు ధరించాలని చెప్పాడు. ఈ టాస్క్ లో శోభా, తేజా, యావర్ పోటీపడ్డారు. ముగ్గురూ దొరికిన బట్టలన్నీ ధరించారు. తేజ అయితే ఇతర కంటెస్టెంట్స్ డ్రాయర్లు, షార్ట్స్ కూడా వేసుకున్నాడు. విప్పుతుంటే వాళ్ళు అవి మావి కదా అంటూ ఆశ్చర్యపోయారు. గార్డెన్ ఏరియాలో బట్టలు విప్పుతూ తేజ సిగ్గు పడ్డాడు. అటు తిరగాలని అమ్మాయిలతో తేజా అన్నాడు. ప్రియాంక గట్టిగా నవ్వింది. అశ్విని కళ్ళకు కొంగు అడ్డుపెట్టుకుంది. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో చూడాలి..