బిగ్ బాస్ సీజన్ 3 పదో వారం రసవత్తరంగా సాగుతోంది. గురువారం నాడు కెప్టెన్సీ టాస్క్ సాగింది. బుధవారం ఎపిసోడ్ లో రాహుల్, వరుణ్ లు గొడవ పడిన సంగతి తెలిసిందే. దాని ప్రభావం గురువారం ఎపిసోడ్ లో పడింది. హౌస్ లో అందరూ కలిసి ఉండగా.. రాహుల్, పునర్నవి మాత్రం మరోవైపు ఉన్నారు. 

'ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అది మగతనం కాదంటూ' వరుణ్‌ ను ఉద్దేశించి.. రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మొత్తంగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో  శ్రీముఖి, రవిలు ఎక్కువ ఇటుకలతో గోడ కట్టడంతో వాళ్లను ఈ గేమ్ విన్నర్‌ లుగా ప్రకటించింది శివజ్యోతి.

వీలునామా తన దగ్గరే దాచుకోవడంతో శివజ్యోతి కెప్టెన్సీ టాస్క్ కి అర్హత సాధించింది. ఓవరాల్ గేమ్‌లో శివజ్యోతి అసిస్టెంట్‌గా ఉన్న బాబా బాస్కర్‌ని బెస్ట్ పెర్ఫామర్‌గా ప్రకటించారు. దీంతో రవి, శ్రీముఖి, బాబా బాస్కర్‌, శివజ్యోతిలను ఈ వారం కెప్టెన్‌ పోటీదారులుగా ప్రకటించారు బిగ్ బాస్.

ఇక హౌస్ లోకి అలీ రీఎంట్రీ ఇవ్వడం హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చింది. అలీని చూడగానే శివజ్యోతి ఎప్పటిలానే ఎమోషనల్ అయింది. ఇప్పుడు హౌస్ లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అలీ రీఎంట్రీ మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది!