మలయాళ నటి భావన పెళ్లి సందడి

మలయాళ నటి భావన పెళ్లి సందడి

 

మలయాళ నటి భావన మరికొన్ని గంటల్లో తన చిరకాల మిత్రుడు నవీన్‌ను వివాహం చేసుకోనుంది. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి మెప్పించిన భావన కేరళలోని త్రిసూర్‌లో ‘లులు కన్వెన్షన్ సెంటర్’లో సోమవారం (జనవరి 22) వీరి పెళ్లి వేడుకలను జరిపేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భావన కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి ముందు జరిపే మెహందీ ఫంక్షన్‌లో ఆమె తన సన్నిహితులతో కలిసి సందడి చేసింది.

దగ్గరి బంధువుల సమక్షంలో శనివారం భావన మెహందీ ఫంక్షన్‌ ఉల్లాసంగా సాగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మెహిందీ వేడుకల్లో పసుపు రంగు గౌను ధరించిన భావన మెరిసిపోతోంది. ఈ డ్రెస్సులో ఆమె మేలిమి బంగారంలా ఉందంటూ అభిమానులు కామెంట్లు గుప్పిస్తున్నారు. భావన వివాహాన్ని సింపుల్‌గా నిర్వహిస్తున్నామని ఆమె సోదరుడు జయదేవ్‌ మీడియాకు తెలిపాడు.

2017 మార్చి 9న నవీన్‌‌తో భావన ఎంగేజ్‌మెంట్ జగింది. శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న నవీన్‌.. చిన్ననాటి నుంచే భావనకు మంచి మిత్రుడు. వీరి వివాహానికి మిత్రులు, బంధువులు ఇప్పటికే త్రిసూరు చేరుకున్నారు. సోమవారం వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos