చంద్రబాబు - కేసీఆర్ ఆస్తుల వివరాలు..? ఎవరు సంపన్నులు? ఎవరి ఆస్తి ఎంత ?
ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ల ఆస్తుల వివరాలు ఏంటీ..? ఎవరి ఆస్తి పెరిగింది..? ఆస్తులవిషయంలో ఎవరు ముందున్నారు..? అనే విషయాలు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. గడువు ముగుస్తున్న కొద్దీ నామినేషన్ల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఆయా పార్టీల నేతలు తన నామినేషన్లు దాఖలు చేస్తుండగా.. వారి ఆస్తులు-అప్పుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ నాయకుల, పార్టీ అధినేతల ఆస్తుల వివరాల గురించి నెట్టింట్లో తెగ వెతుకున్నారు ఓటరు మహాశయులు. ఈ తరుణంలో తెలుగు దేశం పార్టీ అధినేత, ఇటు బీఆర్ఎస్ అధినేత ఆస్తు్లు, అప్పులు వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఇద్దరూ నేతల్లో ఆస్తుల్లో టాప్ లో ఉన్నారు ? లీస్ట్ లో ఉన్నారో తెలుసుకుందాం?
CM KCR Profile
తొలుత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పరిశీలిస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల అప్పులు వివరాలిలా ఉన్నాయి. కేసీఆర్ తన పేరిట రూ. 58.7 కోట్ల ఆస్తులు, బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్, టెర్మ్ డిపాజిట్లు ఖాతాలలో రూ. 11,16,25,887 డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
kcr
అలాగే.. తన భార్య శోభ పేరిట బ్యాంకులలో రూ. 6,29,08,404 ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రూ. 2,31,00,000 విలువైన వాటాలు.. తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 4,16,25,000 విలువైన వాటాలు ఉన్నాయని కేసీఆర్ తన నామినేషన్ లో పేర్కొన్నారు. ఇన్ని ఆస్తులున్నా.. కేసీఆర్ పేరిట మాత్రం ఎలాంటి వాహనం లేదంట.
KCR, BRS, Telangana
అదే సమయంలో రూ. 17,40,000 విలువ చేసే 3 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు ఆయన వద్ద ఉన్నాయి. శోభ పేరిట 2 కేజీల 800 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. 45 కేజీల వెండి వస్తువులున్నాయి. వీటన్నిటి మొత్తం విలువ రూ. 1,49,16,408గా పేర్కొన్నారు. ఇక చరాస్తుల విషయానికి వస్తే.. కేసీఆర్ పేరిట చరాస్తులు రూ. 17,83,87,492 ఉండగా, ఆయన భార్య శోభ పేరిట రూ. 7,78,24,488 ఉన్నాయి. ఇక, కేసీఆర్ ది ఉమ్మడి కుటుంబం . ఈ ఉమ్మడి కుటుంబం పేరిట రూ. 9,81,19,820 మేర చరాస్తులున్నాయి. అలాగే.. మొత్తం అప్పులు రూ. 24,51,13,631 ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Chandrababu Bhuvaneshwari
Chandrababu Bhuvaneshwari: ఇటీవల తెలుగు దేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తరఫున ఆయన భార్య భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ల పేరుపై ఉన్న ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి అందించారు.
nara lokesh
తాజా అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు నాయుడు పేరిట రూ.4.80 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన భువనేశ్వరి రూ. 763.93 కోట్ల విలువైన హెరిటేజ్ షేర్లు సహా రూ. 810.37 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు.
ఇక నారా లోకేష్ కుటుంబ ఆస్తులు విలువ 542 కోట్ల వరకూ ఉంది. ఇక చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ టోటల్ గా 1,473 కోట్లుగా ఉంది. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబుకు 1994లో కొనుగోలు చేసిన అంబాసిడర్ కారు ఉండగా, ఆయన భార్య భువనేశ్వరికి సొంత వాహనం లేదని వెల్లడైంది. అలాగే గత ఐదేళ్లలో ఈ దంపతుల ఆస్తులు 39 శాతం పెరిగిందని వెల్లడించారు.