Asianet News TeluguAsianet News Telugu

పవన్ పై ప్రేమ కురిపిస్తన్న బండ్ల... మళ్ళీ దగ్గర కావడం కోసమేనా!

బండ్ల గణేష్ బయ్యా ఏం చేసినా సంచాలనే. ఈయన వేసే సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా మనోడు గబ్బర్ సింగ్ మూవీ సమయంలో పవన్ కళ్యాణ్ ఎంతగా కష్టపడ్డాడో తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

Bandla ganesh interesting tweet on pawan kalyan
Author
Hyderabad, First Published Jul 31, 2022, 3:40 PM IST

ఈ మధ్య బండ్ల గణేష్ పైత్యం చూసిన పవన్ కళ్యాణ్ ఆయన్ని పక్కన పెట్టడన్న మాట వినిపిస్తుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముందు బండ్ల గణేష్ ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తో మాట్లాడారు. దానికి సంబంధించిన ఆడియో రికార్డు బయటికి వచ్చింది. సదరు రికార్డు లో బండ్ల దర్శకుడు త్రివిక్రమ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నేను భీమ్లా నాయక్ ఈవెంట్ కి వస్తే తాను డామినేట్ అయిపోతాడని భావించిన త్రివిక్రమ్ నన్ను రాకుండా చేస్తున్నాడంటూ బండ్ల అభిప్రాయపడ్డారు.

ఈ కాల్ రికార్డు బాగా వైరల్ అయ్యింది. దీంతో బండ్ల వివరణ ఇచ్చారు. ఆ కాల్ రికార్డులో ఉంది నా వాయిస్ కాదని బుకాయించాడు. మరి నిజం ఏమిటో పవన్ కి తెలిసిపోయినట్లు ఉంది. తనలో సగమైన త్రివిక్రమ్ ని తిడితే తట్టుకోలేకపోయాడు. అప్పటి నుండి పవన్ ఆయన్ని దూరం పెట్టాడు. ఆ సంఘటన తర్వాత పవన్ తో బండ్ల కలిసిన సందర్భాలు లేకుండా పోయాయి.

పరిస్థితులు ఇలా ఉండగా బండ్ల గణేష్ ఓ వీడియో షేర్ చేశారు. గబ్బర్ సింగ్ మూవీ సమయంలో పవన్ కళ్యాణ్ రోజుకు 20 గంటలు పని చేశాడు అంటూ గతంలో చెప్పిన వీడియో షేర్ చేశాడు. ఇవన్నీ పవన్ కి దగ్గిర కావడం కోసం బండ్ల చేస్తున్న ట్రిక్ అని కొందరు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios