Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ఏదీ దాచుకోరు..స్టేజీపైనే రివీల్ చేసేసారు, ఎవరేమనుకున్నారో...

బాలయ్య చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ స్టేజ్ పై బాలయ్య మాట్లాడుతూ ...

Balakrishna about kannada movie Mufti look
Author
First Published Feb 8, 2023, 6:16 AM IST

బాలయ్య చాలా ఓపెన్ గా ఉంటారు. తన మనస్సులో ఏదీ దాచుకోరు అని చెప్తారు. అదే విషయం మరోసారి ప్రూవైంది. బాలయ్య సంక్రాంతి చిత్రం వీరసింహా రెడ్డి మంచి విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ లో ఉండగా... షూటింగ్ లొకేషన్ నుంచి బాలయ్య బాబు ఫోటో లీక్ అయింది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. లీక్ అయిన బాలకృష్ణ ఫొటో చూసిన అభిమానులు షాక్  అయ్యారు.బాలయ్య బాబు చేస్తున్న ఈ సినిమా కన్నడ బ్లాక్‌బస్టర్ ‘మఫ్టీ’కి రీమేక్ అంటూ తెగ వార్తలు వచ్చాయి. మరో ప్రక్క బాలయ్య కోసం డైరెక్టర్ గోపీచంద్ పూర్తిగా వేటపాలెం నేపథ్యంలోనే ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  కానీ  బాలయ్య స్టిల్ చూసిన వారంతా మప్టీ సినిమాకు రీమేక్ యే అన్నారు. 

మఫ్టీ సినిమా లుక్ కూడా ఇలాగే ఉంటుంది. అందులో శివన్న బ్లాక్ డ్రెస్ వేస్కొని కూర్చోగా వెనకాల ఓ వ్యక్తి నిలబడి ఉంటాడు. అదే స్టైల్ లో బాలయ్య బాబు ఫొటో ఉంది. పూర్తిగా అదే కథను తీసుకున్నారా లేదంటే అక్కడ నుంచి ఓ లైన్ తీసుకొని బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లు మారుస్తున్నారా అనే డిస్కషన్స్ జరిగాయి. అయితే మప్టీ కథకు వీరసింహా రెడ్డి సినిమాకు సంభందం లేదని తేలిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ టాపిక్ వచ్చింది. అందుకు కారణం బాలయ్యే.  వివరాల్లోకి వెళితే...

 కన్నడలో శివ రాజ్ కుమార్ 'వేద' సినిమాను చేశారు. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి హర్ష దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, అక్కడ ఘనవిజయాన్ని సాధించింది. దాంతో తెలుగులో ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేస్తున్నారు. శివ రాజ్ కుమార్ కి ఇది 125వ సినిమా. అందువలన సంఖ్యా పరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాదులో బాలయ్య చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ స్టేజ్ పై బాలయ్య మాట్లాడుతూ ...."శివ రాజ్ కుమార్ గారు ఇంతకుముందు 'మఫ్టీ' అనే ఒక సినిమా చేశారు. 'వీరసింహారెడ్డి'లో ఓల్డ్ లుక్ ఎలా ఉండాలనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు 'మఫ్టీ' సినిమాలోని శివరాజ్ కుమార్ గారి లుక్ గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ ఫొటోలను తెప్పించాను. " అని చెప్పుకొచ్చారు. ఇది విన్న వాళ్లు షాక్ అయ్యారు. బాలయ్యలా ఎవరూ తను ఫలానా సినిమాలో ఫలానా హీరో లుక్ తీసుకున్నానని చెప్పారని అంటున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios