తెలుగులో ఉదయ్‌ కిరణ్‌ `నువ్వు నేను`, అల్లరి నరేష్‌ `తొట్టిగ్యాంగ్‌` హీరోయిన్‌ అనితా హసా నందాని త్వరలో తల్లి కాబోతుంది. పండంటి బిడ్డకి జన్మినిచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని అమె శనివారం పంచుకుంది. 

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ చిత్రాల్లో నటించిన అనితా.. వ్యాపారవేత్త అయిన రోహిత్‌రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. 2013లో వీరి వివాహం జరిగింది. దాదాపు ఏడేళ్ల తర్వాత వీరి ఫస్ట్ టైమ్‌ బిడ్డకి జన్మనివ్వబోతుంది. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేసింది. 

ఇందులో రోహిత్‌రెడ్డిని ప్రేమించడం, ఆ తర్వాత ఆయన అనితాకి లవ్‌ ప్రపోజ్ చేయడం, ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్‌, మ్యారేజ్‌ జరగడం, ఇప్పుడు ఫైనల్‌గా ప్రెగ్నెంట్‌ కావడం సన్నివేశాలను చూపిస్తూ ఓ వీడియోని రూపొందించారు. బేబీ బంప్‌తో కూడిన  ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. సెలబ్రిటీలు, అభిమానులు విశెష్‌ చెబుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

❤️+❤️=❤️❤️❤️ Love you @rohitreddygoa #gettingreadyforreddy

A post shared by Anita H Reddy (@anitahassanandani) on Oct 10, 2020 at 5:24am PDT

అనితా హసా నందాని తెలుగులో `నువ్వు నేను`, `తొట్టిగ్యాంగ్‌`తోపాటు `శ్రీరామ్‌`, `నిన్నే ఇష్టపడ్డాను`, `ఆడంతే అదో టైప్‌`, `నేను పెళ్లికి రెడీ`, `ఇది సంగతి`, `ఆహా నా పెళ్ళంట`, `మనలో ఒకడు` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో సీరియల్స్, వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉంది.అందులో `నాగ్గిన్‌` సిరీస్‌ బాగా పాపులర్‌ అయ్యింది.