దేశ సరిహద్దులు దాటి.. అంతర్జాతీయ స్థాయిలో హల్ చల్ చేసింది ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట. ఆస్కార్ సాధించిన ఈ సాంగ్.. ఇప్పటికీ ఏదొ ఒక చోట.. కొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సాధించన ఘనత గురించి అందరికి తెలిసిందే. సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాదించి మరింతగా దూసుకుపోయింది. అంతకు ముందు కూడా ఈ పాట ప్రపంచవ్యాప్తం అయింది. చాలా మంది హాలీవుడ్ స్టార్స్ చేత డాన్స్ చేయించింది. సామాన్యులు, సెలబ్రిటీల వరకూ నాటు నాటు పాటకు డాన్స్ వేయని వారు అంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ నాటు నాటు పాటకు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన కెనడా, జపాన్, అమెరికాలోనూ ఈ పాటకు అదరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ ను చూశాం. అటు ఏకంగా ఆస్కార్ స్టేజ్ మీద కూడా ఈ పాటకు అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్ ను చూశాం. ఇలా నాటు నాటు కదిలించని సెలబ్రిటీలు లేదు. మరీ ముఖ్యంగా భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం, రామ్ చరణ్ తో కలసి ఈ పాటకు స్టెప్స్ వేశారు. అంతే కాదు ఈ పాటకు కాని ఈ సినిమాకు సంబంధించిన చిత్రమైన విషయాలు ఎన్నో గతంలో పంచుకున్న మహేంద్ర.. రీసెంట్ గా మరో సారి నాటు నాటు పాటకు సబంధించిన ఓ వీడియోను శేర్ చేసుకున్నారు.
నాటు నాటు పాటకు ఇప్పటి వరకూ సామాన్యులు..సెలబ్రెటీలు మాత్రమే డాన్స్ చేశారు. కాని ఈసారి ఈ పాటకు ఓ తోలు బోమ్మ అదరిపోయే స్టెప్పులు వేసింది. ఇలా డాన్స్ చేయించడానికి అక్కడి నిర్వాహకులు.. బాగా కఫ్టపడ్డారట కూడా. అది అంత సులభమైన విషయం కాకపోయినప్పటికీ.. ఓ మహిళ దాన్ని చేసి చూపించింది. ఓ తోలుబొమ్మతో ఓ మహిళ చేయించిన నాటు నాటు డ్యాన్స్ వీడియోని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఒకే ఒకే ఒక లాస్ట్ ట్వీట్. నాటు నాటు పై నేను ఒక హామీ ఇస్తున్నాను. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే నిదర్శనం.ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తాన్ని తన తీగలపై కలిగి ఉంది అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రెండు నిమిషాల డ్యూరేషన్ ఉన్న వీడియోను శేర్ చేశారు ఆనంద్ మహేంద్ర. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.