ప్రముఖ నిర్మాత అల్లు అరవిద్, మరియు ఆయన కుమారుడు స్టార్ అల్లు అర్జున్ తన సొంత సినీ స్టూడియోని ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దగ్గుపాటి ఫ్యామిలీ రామానాయుడు స్టూడియోస్ ని, అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోస్ ని రన్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అల్లు ఫ్యామిలీ సైతం అల్లు స్టూడియోని ప్రారంభించారు. ఇదొక లార్జ్ స్కేల్ ఫిల్మి స్టూడియో కానుంది. ఇంతకీ ఎంత పెట్టుబడి ఈ స్టూడియోపై పెడుతున్నారు...ఎక్కడ కడుతున్నారనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ స్టూడియోపై వంద కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ గండిపేట దగ్గర పది ఎకరాలు లాండ్ ని ఈ స్టూడియో కోసం కొనుగోలు చేసారు. అలాగే ఈ స్టూడియోకు వచ్చిన వాళ్లు అక్కడే షూట్ చేసుకుని, ఎడిటింగ్ చేసుకుని, విఎఫ్ ఎక్స్ కూడా పూర్తి చేసుకునేలా ఈ స్టూడియో నిర్మాణం చేస్తున్నారు. అల్లు అరవింద్ చిరకాల కోరిక ఇది అని, దీని కోసం ఆయన చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. 
 
 తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అల్లు రామలింగయ్య జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో అల్లు స్టూడియోస్ ప్రారంభించారు.  సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది.

ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది.