Food
బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి, మెమోరీ పవర్ ను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి.
గుమ్మడి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, జింక్, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బ్రెయిన్ ను హెల్తీగా ఉంచుతాయి.
డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
బ్లూబెర్రీలు మెదడును రక్షించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అభిజ్ఞా అభివృద్ధికి ఎంతో సహాయపడతాయి.
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తిన్నా ఆరోగ్యంగా ఉంటుంది.
గుడ్లలో కోలిన్, బి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో సహా మెదడు పనితీరుకు మేలు చేసే ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని, మొత్తం అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.