అల్లు అరవింద్‌.. తనయుడు, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ స్టార్‌గా వర్ణించారు. అల్లు పతాకాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లారని ప్రశంసలు కురిపించారు. 

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌(Allu Arvind).. తనయుడు, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun)పై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ స్టార్‌గా వర్ణించారు. అల్లు పతాకాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లారని ప్రశంసలు కురిపించారు. ఎమోషనల్‌ వర్డ్స్ ని పంచుకున్నారు. వరుణ్‌ తేజ్‌(Varun Tej) బాక్సర్‌గా నటించిన చిత్రం `గని`(Ghani). కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మజ్రేకర్‌ కథానాయికగా నటించగా, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదల కానుంది. 

తాజాగా ఉగాది పండుగ సందర్భంగా వైజాగ్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌(Ghani Pre Release Event)ని నిర్వహించారు. అల్లు అర్జున్‌ గెస్ట్ గా హాజరయ్యారు.ఈ ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అరవింద్‌ సినిమాపై తన కాన్ఫిడెంట్‌ని వెల్లడించారు. సినిమాని తాను చూశానని, కచ్చితంగా హిట్‌ కొట్టబోతున్నారని, దర్శకుడు కిరణ్‌ టాలీవుడ్‌లో పెద్ద డైరెక్టర్‌ అవుతాడని తెలిపారు. తన పెద్ద కుమారుడు అల్లు బాబీ గురించి చెబుతూ, తనకు సినిమాపై చాలా నాలెడ్జ్ ఉందని, తెరవెనుక ఇన్నాళ్లు ఉన్నారని,ఆయన్ని అంతా కలిసి బలవంతంగా నిర్మాతని చేశారని, ఈ సినిమాతో తానేంటో నిరూపించుకుంటారని, సిద్దు ముద్దాతో కలిసి మంచి సినిమా తీశారని, ఎంతో కష్టపడ్డారని తెలిపారు. 

హీరో వరుణ్‌ తేజ్‌ గురించి చెబుతూ, నాగబాబు వలే మంచి వ్యక్తి అని, ఆయన హైట్‌ ఎంతో బాగుంటుందన్నారు. `కేజీఎఫ్‌ ` సినిమా చూశాక వరుణ్‌తో ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందనిపించిందని, భవిష్యత్‌లో ఆయనతో ఓ మంచి సినిమా చేస్తానని తెలిపారు. నవీన్‌ చంద్ర నటనని అభినందించిన అల్లు అరవింద్‌.. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌పై మొదటిసారి ప్రశంసలు కురిపించారు. అల్లు రామలింగయ్య ఎక్కడో పాలకొల్లులో జన్మించి చెన్నైలో సినిమాల్లో స్థిరపడి యాభై ఏళ్లు రాణించారు. సినిమాలు నిర్మించారు. దాన్ని దాని పొడిగిస్తూ హిందీలో 12 సినిమాల చేశాను. కొంత వరకు సంతృప్తిగాఉన్నాను. 

కానీ అల్లు అర్జున్‌ తన పతాకాన్ని జాతీయ వ్యాప్తంగా ఎగరేశారని, ఇటీవల ఆయన `పుష్ప` చిత్రంతో ఇండియా వైడ్‌గానే కాదు, అంతర్జాతీయంగా అల్లు పతాకాన్ని ఎగరేశారని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా బన్నీని అభినందించారు. తన కుమారుల పట్ల తాను గర్వంగా ఉన్నట్టు చెప్పారు అల్లు అరవింద్‌. వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న సినిమా కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని, ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని చెప్పారు. వరుణ్‌ తేజ్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడని, కరోనా సమయంలోనే ఎంతో శ్రమించారని తెలిపారు.