బన్నీ పొలిటికల్ టర్న్ తీసుకోబోతున్నాడా..? ఇదెక్కడి ట్విస్ట్

allu arjun to work with new director santosh reddy
Highlights

తాజాగా బన్నీకి సంతోష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు కథ వినిపించినట్లు సమాచారం. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని తెలుస్తోంది. ఈ కథ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో బన్నీ కూడా సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని టాక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ టర్న్ తీసుకోబోతున్నాడా..? అంటే అవుననే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇది మీరు అనుకుంటున్నట్లు నిజమైన రాజకీయాలు కాదు.. రీల్ రాజకీయాలు. అదెలా అంటే.. 'నా పేరు సూర్య' సినిమా నిరాశ పరచడంతో బన్నీ తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో కలిసి పని చేయబోతున్నాడనే వార్తలు బలంగా వినిపించాయి.

విక్రమ్.. బన్నీకి స్టోరీ చెప్పడం దానికి బన్నీ కొంత మార్చి రాయమని అడగడం అన్నీ జరిగాయి. కానీ సెకండ్ హాఫ్ బన్నీకి సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. తాజాగా బన్నీకి సంతోష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు కథ వినిపించినట్లు సమాచారం. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని తెలుస్తోంది. ఈ కథ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో బన్నీ కూడా సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని టాక్.

సింగిల్ సిట్టింగ్ లో బన్నీని ఇంప్రెస్ చేశాడట సదరు కొత్త డైరెక్టర్. ఈ మధ్యకాలంలో పొలిటికల్ కథలు బాగా క్లిక్ అవుతుండడంతో ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే వర్కవుట్ అవుతుందని అల్లు టీమ్ భావిస్తోంది. విక్రమ్ సినిమాను పక్కన పెట్టి బన్నీ ఈ కొత్త డైరెక్టర్ తో సినిమా చేసినా.. ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కానీ బన్నీ ఉన్న పరిస్థితుల్లో కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడం రిస్క్ అని కొందరు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి!

loader