స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిన్న జరిగిన 'టాక్సీవాలా' ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విజయ్ పై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ''మన సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లేది రచయితలే.. అందరికంటే ఎక్కువ పని చేసి తక్కువ పేరు పొందేది కూడా వాళ్లే.

నాకు ఎవరైతే ఎదిగితే చాలా ఆనందంగా ఉంటుంది. నా దగ్గర పని చేసిన ఆఫీస్ బాయ్ ఇప్పుడు ప్రొడక్షన్ మ్యానేజర్ గా ఎదిగాడు. నా దగ్గర పనిచేసేవాళ్లు పదేళ్ల తరువాత కూడా అలానే ఉంటే నాకు బాధగా ఉంటుంది. వీళ్ల ఎదుగుదలకి నేనేం సహాయం చేయలేకపోయానా అనే బాధ నాకుంటుంది. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా ఎదగాలని కోరుకునే మనస్థత్వం నాది.

విజయ్ దేవరకొండ కూడా చాలా కష్టపడి ఎదిగాడు. తను కొత్తగా ప్రయత్నిస్తూ జనాలకు దగ్గరవుతున్నాడు. మా అందరికీ సినిమాలలో ఎంట్రీ చాలా సులభం అయింది. నా లాంచ్  రాఘవేంద్రరావు లాంటి దర్శకుడు చేశాడు. కానీ విజయ్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనను తాను శిల్పంలా మలచుకున్నాడు. ఈ మధ్య విజయ్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఒక మనిషి ఎదుగుతుంటే అతడిపై నెగెటివ్ ఫోర్స్ కూడా ఉంటుంది. అవన్నీ దాటి విజయ్ హిట్స్ కొడతాడనే నమ్మకం నాకుంది. నాకంటే తను పెద్ద స్టార్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను. తన సక్సెస్ ని ఎంజాయ్ చేసే వాళ్లలో నేనొకడిని. ఈ సినిమాని పైరసీ చేసి తప్పు చేశారు. వారందరికీ విజయ్ మాదిరి నేను మిడిల్ ఫింగర్ చూపించలేను

కానీ మీరు చేసిన పని మాత్రం చాలా తప్పు. సినిమా అనేది మీకు రెండున్నర గంటల ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కానీ మాకు అదే జీవితం. దయచేసి పైరసీ ఎంకరేజ్ చేయకండి'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇవి కూడా చదవండి.. 

టాక్సీవాలా ట్రైలర్.. భయంతో విజయ్ దేవరకొండ!

టాక్సీ వాలా సెన్సార్ వర్క్ ఫినిష్.. టాక్ ఏంటంటే?

కథ విని పారిపోబోయా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

విజయ్ దేవరకొండకు బన్నీ సెంటిమెంట్.. హిట్టు పక్కా!

విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

విజయ్ దేవరకొండకి ఆ అమ్మాయి కలిసొస్తుందా..?

విజయ్ దేవరకొండ పరిస్థితి ఇలా అయిందేంటి..?

'టాక్సీవాలా' సినిమా లీక్.. విజయ్ దేవరకొండకి మరో షాక్!

విజయ్ దేవరకొండ సినిమాకి లైన్ క్లియర్!

ట్యాక్సీ వాలా ఆలస్యానికి కారణమిదే!

విజయ్ 'టాక్సీ వాలా' లిరికల్ సాంగ్: మాటే వినదుగా

విజయ్ దేవరకొండ వదిలేటట్లులేడు, తలపట్టుకున్న రవితేజ!