Asianet News TeluguAsianet News Telugu

`పుష్ప`రాజ్‌ సెట్‌లోకి వచ్చేసినాడు.. పిచ్చెక్కిస్తున్న బన్నీ లుక్‌!

సెట్‌లోకి స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అడుగుపెట్టాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో కూలీగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇరుక్కున్న పుష్పరాజ్‌గా బన్నీ కనిపిస్తాడని తెలుస్తుంది. తాజాగా బన్నీ అడవిలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఫోటోని ట్విట్టర్‌ ద్వారా మైత్రీమూవీ మేకర్స్ పంచుకున్నారు.

allu arjun join in pushpa shooting arj
Author
Hyderabad, First Published Nov 12, 2020, 2:45 PM IST

అల్లు అర్జున్‌ హీరోగా `పుష్ప` చిత్రం రూపొందుతుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వీరి కాంబినేషన్‌లో `ఆర్య`, `ఆర్య2` తర్వాత మూడో సినిమా కావడం విశేషం. దీనితో హ్యాట్రిక్‌ కొట్టాలని వీరిద్దరు భావిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ లాక్‌ డౌన్‌ అనంతరం ఇటీవల ప్రారంభమైంది. గత వారం సినిమా షూటింగ్‌ని తిరిగి ప్రారంభించినట్టు చిత్ర బృందం, సుకుమార్‌ తెలిపారు. 

తాజాగా సెట్‌లోకి స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అడుగుపెట్టాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో కూలీగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇరుక్కున్న పుష్పరాజ్‌గా బన్నీ కనిపిస్తాడని తెలుస్తుంది. తాజాగా బన్నీ అడవిలోకి వెళ్తున్నట్టుగా ఉన్న ఫోటోని ట్విట్టర్‌ ద్వారా మైత్రీమూవీ మేకర్స్ పంచుకున్నారు. `పుష్ప రాజ్‌` వచ్చేసినాడు` అని పేర్కొంది. గురువారం నుంచి బన్నీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఇందులో ఎర్రని చెక్స్‌ షర్ట్, ఖాకీలు ధరించిన పాయింట్‌ వేసుకుని మోటుగా కనిపిస్తున్నాడు బన్నీ. వెనకాల నుంచి తీసిన ఫోటోని పంచుకోగా, ఇందులో పెద్దగా, రింగులతో ఉన్న జుట్టుతో బన్నీ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios