ఆహా అనేది పెద్ద కుటుంబం అయ్యినందుకు చాలా సంతోషిస్తున్నాని అందుకే తమ వీక్షకులను తమ కుటుంబంగానే భావిస్తున్నాని వినోదం అంటే మనకు ఇష్టం, తెలుగు అంటే ఇంకా ఇష్టం అందుకే రెండు కలగలిపిన ఆహా ను ఆదరించడం వలనే తమకు కృతజ్ఞులం అని తెలిపారు. అలాగే జూపల్లి రామేశ్వర్ గారికి, రాము గారికి మరియు ఆహా యాప్ కోసం పని చేస్తున్న సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అల్లు అరవింద్ ఆ లేఖ ద్వారా తెలిపారు. 

ఆ లేఖ యధాతథంగా..

‘‘ప్రియమైన కుటుంబ సభ్యులకు

అలా ఎందుకు అంటున్నాను అంటే.. ఈ రోజు ‘ఆహా’ అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు సంతోషంగానూ గర్వంగానూ ఉంది. మీ ప్రేమ ఆదరణ వల్ల ఈ రోజు ‘ఆహా’ మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్నది. ఈ ‘ఆహా’ కుటుంబంలో మనమందరమూ సభ్యులమే కదా!

వినోదం అంటే మనకు ఇష్టం - తెలుగు అంటే ఇంకా ఇష్టం. రెండూ కలిసిన ఈ ‘ఆహా’ను విజయవంతంగా నడిపిస్తున్న మీకు మేము ఎంతయినా కృతజ్ఞులం.

శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారరికి రాము గారికి మాతో కలిసి నడిచే మా భాగస్వాములందరికీ ఇంత వేగంగా దీనిని తీసుకు రావడానికి నిర్విరామంగా పనిచేసిన మా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు

ప్రేమతో
అల్లు అరవింద్’’
అంటూ లేఖను ముగించారు