జనరల్‌గా ఓ సినీ నటి అర్థనగ్న ఫోటోలు పంచుకుంటేనే అభిమానులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తారు. అనేక రకాలుగా కామెంట్‌ చేస్తున్నారు. ఇక నగ్నంగా పోజులిస్తే, బూతులు తిడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇక్కడ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఓ నటి నగ్నంగా ఫోటో దిగి సోషల్‌ మీడియాలో పంచుకోగా, అందుకు అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెని ఆకాశానికి ఎత్తుతున్నారు. మరి ఇంతకి ఆ నటి ఎవరు? ఆమె ఏం చేసిందనేది చూస్తే.. 

తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం `అర్జున్‌రెడ్డి`ని హిందీలో `కబీర్‌ సింగ్‌` పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. షాహిద్‌ కపూర్‌, కియారా జంటగా నటించారు. ఇందులో వంట మనిషి పాత్రలో వనితా ఖరత్‌ నటించారు. తాజాగా ఆమె న్యూడ్‌ ఫోటోని పంచుకుంది. న్యూడ్‌గా కూర్చొని కైట్‌ని అడ్డుపెట్టుకుంది. బాడీ పాజిటివిటీ పేరుతో ఆమె తన ఇన్‌స్టాలో ఈ న్యూడ్‌ ఫోటోని షేర్‌ చేసింది. 

ఈ సందర్భంగా ఆమె చెబుతూ, నా ప్రతిభ పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నా. నా పాషన్‌, నా నమ్మకం, నా శరీరం పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నా. ఎందుకంటే నేనంటే నేనే గనుక` అని పేర్కొంది. ఈ సందర్భంగా బాడీ పాజిటివిటీ మూవ్‌మెంట్‌కి తెరలేపారు. ఇది అభిమానులను విశేషంగా అలరిస్తుంది. ఆకట్టుకుంటుంది. దీంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. `సూపర్‌, బ్యూటీ, `సూపర్‌ కాన్ఫిడెంట్‌ వనితా..` అని, `ఫోటో అసభ్యతకు ఆస్కారం లేకుండా అందంగా ఉంది` అని, `మన పట్ల మనకు నమ్మకం, ప్రేమ ఉండటం ఎంత ముఖ్యమో చాలా బాగా చెప్పారు` అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతుంది.