హాలీవుడ్ లో సూపర్ హీరోల సీరీస్ లు గత కొన్నేళ్లుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్టు టెక్నీషియన్స్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకుంటూ లక్షల కోట్లు అందుకుంటున్నారు. ఇకపోతే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పుడిపుడే సీక్వెల్స్ పుట్టుకొస్తున్నాయి. 

హృతిక్ రోషన్ క్రిష్ సిరీస్ ఇప్పటికే మంచి సక్సెస్ ను అందుకుంటోంది. ఇక దర్శకుడు శంకర్ అంతకంటే ఉన్నత స్థాయిలో రోబో సీక్వెల్స్ ఉండాలని అనుకుంటున్నాడు. ఈ సిరీస్ లు ఆగకూడదని మరో ఐడియా వచ్చింది అంటే తప్పకుండా 3.0 కూడా ఉంటుందని చెబుతున్నాడు. దేశంలోనే తొలిసారిగా 2.0 అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

ఈ నెల 29న రిలీజ్ కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తెలుగులో వెయ్యికి పైగా స్క్రేన్ లలో సినిమా ప్రదర్శించబడనుంది. 3డి లో వస్తుండడంతో ఆడియెన్స్ లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి,. ఇకపోతే శంకర్ నెక్స్ట్ సీక్వెల్ ను ఇంకా అనుకోలేదట గాని ఫ్యూచర్ లో రజినీకాంత్ ఒప్పుకుంటే తప్పకుండా సినిమా స్పీడ్ గా తెరకెక్కవచ్చని చెప్పాడు, 

అయితే రజినీకాంత్ మాత్రం 2.0 సినిమా కోసమే చాలా కష్టపడ్డాడు. ఏడూ పదుల వయసు దగ్గరపడుతుండటంతో భారీ బడ్జెట్ సినిమాల్లో యాక్షన్ అంటే చాలా కష్టం. 2.0 షూటింగ్ సమయంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న రజినీకాంత్ వైద్యం కోసం అమెరికా వెళ్లారు. 

కొన్ని సందర్భాల్లో నేను సినిమా చేయలేను అని కూడా శంకర్ కి చెప్పారు అంటే రాబోయే సీక్వెల్స్ లో ఆయన ఉండటం కష్టమే. అయితే ఒకే హీరోతో సీక్వెల్స్ చేయాలనీ రూల్ ఏమి లేదు. కథలో మార్పులు చేస్తే ఆడియెన్స్ ను మెప్పించవచ్చు. మరి శంకర్ తన కళను ఎంతవరకు కొనసాగిస్తాడో చూడాలి.