తెలుగులో 2.0 సినిమాను భారీగా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర దర్శకుడు కథానాయకులు రజినీకాంత్ - అక్షయ్ కుమార్ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. శంకర్ వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నం చేసి అందరిని ఆకట్టుకున్నారు.

ఇక సినిమా గత ఏడాది దీపావళికే రిలీజ్ కావాలి. అందుకే అప్పట్లో దుబాయ్ లో భారీ స్థాయిలో ఆడియో వేడుకను కూడా నిర్వహించారు. అయితే ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం శంకర్ కూడా సినిమాను గత ఏడాదిలోనే రిలీజ్ చేయాలనీ అనుకోని VFX పనులకు ఒక షెడ్యూల్ ను సెట్ చేసుకున్నారు. అయితే ఆడియో రిలీజ్ తరువాత సదరు కంపెనీ అనుకున్నంత స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ లో సంతృప్తి పరచలేదు. 

దీంతో శంకర్ దానికంటే పెద్ద కంపెనీని సంప్రదించారు. కొంచెం ఎక్కువగా డబ్బు కూడా ఖర్చు చేసి పూర్తిగా గ్రాఫిక్స్ వర్క్స్ నచ్చే వరకు సినిమాను విడుదల చేయవద్దని లేకుంటే కాన్సెప్ట్ వేస్ట్ అని గట్టి నిర్ణయం తీసుకొని పని చేసినట్లు శంకర్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు.