బాహుబలి 2 సృష్టించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను అధిగమించడానికి 2.0 సిద్ధమైంది. ఆ రికార్డులను ఎంత వరకు అందుకుంటుందో గాని ఓపెనింగ్స్ లో మాత్రం ఈ కాంబో కొత్త రికార్డులు సృస్టించనుందని చెప్పవచ్చు. రిలీజ్ కు ముందే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక మొదటగా అందరిచూపు యూఎస్ రిలీజ్ పైనే ఉంటుంది. 

ముఖ్యంగా ప్రీమియర్స్ ద్వారా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపై అప్పుడే చర్చలు మొదలయాయ్యి. అసలు విషయంలోకి వస్తే.. 2.0 అమెరికాలో బాహుబలి కంటే ఎక్కువ స్క్రీన్స్ లలో రిలీజ్ కాబోతోంది. మూడు భాషల్లో కలుపుకొని చుస్తే.. 800 స్క్రీన్స్ లలో 2.0 ప్రదర్శించబడనుంది. ఎక్కువగా తమిళ్ లో 320 స్క్రీన్స్ లలో రిలీజ్ అవుతుండగా తెలుగు వెర్షన్ - 270 స్క్రీన్స్ లలో ఇక హిందీ వెర్షన్ 210 స్క్రీన్స్ లలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. 

ఇక బుధవారం ప్రీమియర్స్ ద్వారా సినిమా మిలియన్ల డాలర్లను వసూలు చేసేలా ఉందని టాక్. పైగా టికెట్స్ రేట్స్ కూడా రీజనబుల్ గా ఉండటంతో సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా $10 మిలియన్స్ ను అందుకోవడం పక్కా అని తెలుస్తోంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా సినిమా 100 కోట్ల గ్రాస్ ను ఫస్ట్ డేనే అందుకుంటుందని సమాచారం.

సంబంధిత వార్తలు 

అడ్వాన్స్ బుకింగ్స్ తో షాకిస్తున్న 2.0!

యూఎస్ రిలీజ్: బాహుబలి ని కొట్టేసిన 2.0!

'2.0' రిజల్ట్ పై సందేహాలా..?

రోబో 2.0లో అదిరిపోయే స్టంట్స్ చేసిన ఎమీ జాక్సన్ (వీడియో)

2.0 ఆలస్యానికి అసలు కారణం చెప్పిన శంకర్!

2.O లో మళ్ళీ ఆ సీన్స్ ఉండవు..కొత్త విషయాలేన్నో.. : శంకర్

తెలుగు 2.0 ప్రమోషన్స్ కోసం డబ్బు వృధా చేస్తున్నారు: రజినీకాంత్

రోబో సీక్వెల్స్: శంకర్ కొరిక గట్టిగానే ఉంది.. కానీ?