ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న '2.0' సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా టాక్ కి మేకర్స్ భయపడుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

సాధారణంగా ఏ సినిమా అయినా మొదట స్క్రీనింగ్ దుబాయ్ లో జరుగుతుంటుంది. అక్కడ నుండి ఆన్ లైన్ లో సినిమా రిపోర్ట్ ముందే బయటకి వచ్చేస్తుంది. నెగెటివ్ టాక్ వస్తే గనుక ఆ ప్రభావం సినిమాపై కచ్చితంగా పడుతుంది. అందుకే ఈ సినిమా విషయంలో ఆ ఛాన్స్ తీసుకోవాలని అనుకోవడం లేదు.

అన్ని ఏరియాల్లో సినిమాను ఒకే టైం కి వేయాలని మేకర్స్ ఆర్డర్లు వేసినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో షో పడుతుందని అనుకుంటే అసలు ఎక్కడా ప్రీమియర్స్ ఉండవని 29నే ఈ సినిమాని అన్ని చోట్లా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇది కాదని ఎవరైనా షోలు వేస్తే చర్యలు తప్పవని అంటున్నారు. సినిమా టాక్ బ్యాడ్ గా వస్తే సమస్య కానీ హిట్ టాక్ వస్తే బెనిఫిట్ షోల ద్వారా భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది సైన్ ఫిక్షన్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే సినిమా కాబట్టి ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కేలా ఉండొచ్చు.

అందుకే టాక్ ఒకేసారి బయటకి రావాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇది ఇలా ఉండగా చాలా మంది సెన్సార్ వెర్షన్ చూశామని తన రివ్యూలను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇదొక అధ్బుతమైన విజువల్ వండర్ అంటూ సినిమాను పొగిడేస్తున్నారు.