Asianet News TeluguAsianet News Telugu

2.O లో మళ్ళీ ఆ సీన్స్ ఉండవు..కొత్త విషయాలేన్నో.. : శంకర్

రజినీకాంత్ - - అక్షయ్ కుమార్ - శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ మల్టీస్టారర్ ఈ నెల 29న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన తెలుగు అసలైన ప్రమోషన్ ని చిత్ర యూనిట్ ఈ రోజే నిర్వహించింది. 

shankar about difference about 2pointO and robot
Author
Hyderabad, First Published Nov 26, 2018, 8:07 PM IST

రజినీకాంత్ - - అక్షయ్ కుమార్ - శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ మల్టీస్టారర్ ఈ నెల 29న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన తెలుగు అసలైన ప్రమోషన్ ని చిత్ర యూనిట్ ఈ రోజే నిర్వహించింది. దర్శకుడు శంకర్ సినిమాకు యొక్క విశేషాలను తెలిపారు. మునుపెన్నడూ లేని ఒక బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ 2.0 గా అందరికి నచ్చుతుందని అన్నారు. 

అయితే ఫస్ట్ పార్ట్ లో శంకర్ ఎంటర్టైన్ మెంట్ సీన్స్ ను కూడా బాగా చూపించారు. చిట్టి చేసిన పనులు ఫస్ట్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ వరకు బాగానే అలరించాయి. అయితే 2.0 లో మాత్రం వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదని శంకర్ వివరణ ఇచ్చారు. ఇది ఒక ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ.. మొదటి పార్ట్ లో నడిపించినట్టు ఈ సినిమాలో నడిపిస్తే బావుండదని అయితే కొత్త విషయాలు ఎన్నో ఈ సినిమాలో ఉంటాయని అవి కొత్త అనుభూతుని కలిగిస్తాయని చెప్పారు. 

ఇకపోతే సినిమాలో కొంత రొమాన్స్ తో మంచి ఫన్ ఎలిమెంట్స్ ను ఎంటర్టైనర్ ను కవర్ చేసినట్లు వివరిస్తూ.. ఒక గ్లోబల్ మెస్సేజ్ ఉంటుందని తప్పకుండా అది అందరిని ఆలోచింపజేసేవిధంగా ఉంటుందని అక్షయ్ కుమార్ ది విలన్ రోల్ కాదని ఆయన పాత్రలో వివిధ రకాలా షేడ్స్ ఉన్నట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios