టాప్ సెలబ్రిటీలకి మ్యానేజర్ గా వ్యవహరించే అనిర్బన్ దాస్ పై 'మీటూ' ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు తారాలు అతడిపై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో అతడు ముంబైలో వషి బ్రిడ్జ్ లో దూకి మరణించాలని భావించాడు. 

టాప్ సెలబ్రిటీలకి మ్యానేజర్ గా వ్యవహరించే అనిర్బన్ దాస్ పై 'మీటూ' ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు తారాలు అతడిపై లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో అతడు ముంబైలో వషి బ్రిడ్జ్ లో దూకి మరణించాలని భావించాడు.

ఈ మేరకు బ్రిడ్జ్ దగ్గరకి చేరుకొని అక్కడ నుండి దూకే సమయంలో పోలీసులు అతడిని కాపాడినట్లు తెలుస్తోంది. గత రాత్రి 12:30 ప్రాంతంలో వషి ట్రాఫిక్ పోలీస్ కి బ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోబోతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే స్పాట్ కి చేరుకున్న పోలీస్ అనిర్బన్ బ్రిడ్జ్ పైకి ఎక్కడం గమనించాడు.

వెంటనే అతడిని పట్టుకొని కిందకి దించారు. ఆ సమయంలో అనిర్బన్ చాలా వీక్ గా ఉన్నారని, మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యారని మీడియాకి తెలిపారు ట్రాఫిక్ పోలీస్. అనంతం స్టేషన్ కి తీసుకెళ్లి అనిర్బన్ భార్యకి సమాచారం అందించారు.

విచారణ సమయంలో అతడిపై వచ్చిన లైంగిక ఆరోపణల కారణంగా డిప్రెషన్ కి గురైనట్లు, తన ఫ్యామిలీ కూడా ఇబ్బందిపడుతున్నట్లు వెల్లడించారు. టాలీవుడ్ లో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ వంటి సెలబ్రిటీలకు అనిర్బన్ మ్యానేజర్ గా వ్యవహరించారు. 

ఇవి కూడా చదవండి.. 

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!