సినిమా ఇండస్ట్రీలోలో ఎఫైర్లు, రూమర్లు చాలా కామన్. కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్తే.. మరికొన్నిమధ్యలోనే తెగిపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి కూడా గతంలో కొన్ని ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి వాళ్లతో కత్రినా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

రణబీర్ తో తనది బ్యాడ్ బ్రేకప్ అంటూ కత్రినా నేరుగా పలు సార్లు చెప్పింది. ఇప్పుడు ఈ బ్యూటీ మరో హీరోతో ఎఫైర్ పెట్టుకుందంటూ బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.అతడు మరెవరో కాదు.. విక్కీ కౌశల్. 'రాజీ', 'సంజు', 'ఉరి' వంటి చిత్రాల్లో నటించిన విక్కీ కౌశల్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

భీష్మ రిలీజ్ ను అడ్డుకుంటాం.. మొదలైన టైటిల్ వివాదం!

ఇప్పుడు విక్కీ పేరు కత్రినా కైఫ్ జతలో వినిపిస్తూ ఉంది. కత్రినా కైఫ్ కొత్త లవర్ విక్కీనే అంటూ ప్రచారం జరుగుతోంది. దీపావళి సెలబ్రేషన్స్ లో ఇద్దరూ కలిసి కనిపించడం ఆ రూమర్లకు మరింత ప్రచారాన్ని కల్పిస్తూ ఉంది. ప్రస్తుతం విక్కీ 'భూత్' అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విక్కీకి కత్రినాతో డేటింగ్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన విక్కీ.. నిజం చెప్పాలంటే తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను మాత్రమే బయటపెడతానని.. కొన్ని వ్యక్తిగత విషయాలను బయటపెట్టడానికి ఇష్టపడనని.. ఎందుకంటే ఒకవేళ తను అన్ని విషయాలను బయటపెడితే కొందరు వ్యక్తులు వాటి గురించి చర్చలు పెడతారని.. మరికొందరు తన లైఫ్ గురించి తప్పుగా మాట్లాడతారని చెప్పాడు. ఇలాంటివి తనకు నచ్చవవి.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అందరికీ చెప్పాలనుకోవడం లేదని వెల్లడించారు.