Asianet News TeluguAsianet News Telugu

నితిన్ 'భీష్మ' సూపర్ అంటూ త్రివిక్రమ్ రివ్యూ.. నమ్మొచ్చా!

యంగ్ హీరో నితిన్ కెరీర్ మొత్తం ఒడిదుడుకులతోనే కొనసాగుతోంది. కానీ నితిన్ ఎక్కడా పట్టు వదలడం లేదు. పరాజయాలు ఎదురైన ప్రతి సారి అంతే వేగంతో బౌన్స్ బ్యాన్ అవుతున్నాడు.

Trivikram Srinivas Gives review to Nithiin's Bheeshma Movie
Author
Hyderabad, First Published Feb 18, 2020, 3:11 PM IST

యంగ్ హీరో నితిన్ కెరీర్ మొత్తం ఒడిదుడుకులతోనే కొనసాగుతోంది. కానీ నితిన్ ఎక్కడా పట్టు వదలడం లేదు. పరాజయాలు ఎదురైన ప్రతి సారి అంతే వేగంతో బౌన్స్ బ్యాన్ అవుతున్నాడు. ఒక దశాబ్దకాలం పరాజయాల తర్వాత నితిన్ ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే లాంటి చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. 

ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శత్వంలో నటించిన అ..ఆ చిత్రం నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా నితిన్ నటించిన చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. 

వెంకీ కుడుములు ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రోజు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీ రిలీజ్ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నితిన్ కి వాళ్ళ అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎక్కడ ఉన్నా ఉంటాయి. పవన్ అభిమానులందరి తరుపున నితిన్ కి శుభాకాంక్షలు చెబుతున్నా. భీష్మ చిత్ర యూనిట్ కి ముందుగానే అభినందనలు చెబుతున్నా.. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా చూశా అని అన్నారు. భీష్మ చిత్రం చాలా చాలా బావుంది. 

ఈ చిత్ర సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ఫైట్ సీన్, క్లైమాక్స్ ముందు వచ్చే వాటే బ్యూటీ సాంగ్ హైలైట్ గా నిలుస్తాయని త్రివిక్రమ్ అన్నారు. ఫైట్ సీన్ ని వెంకట్ మాస్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు. వాటే బ్యూటీ సాంగ్ కు జానీమాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు అని త్రివిక్రమ్ భీష్మ విశేషాలు చెప్పుకొచ్చారు. 

తన తల్లి బర్త్ డే సెలెబ్రేట్ చేసిన రామ్ చరణ్.. ఫొటోస్!

త్రివిక్రమ్ లాంటి దర్శకుడే భీష్మ చాలా బావుందని చెప్పడంతో ఈ చిత్రానికి కలసి వచ్చే అంశమే. ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్, వెనుక ఉండి నడిపిస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ రాధాకృష్ణకు త్రివిక్రమ్ మంచి సన్నిహితుడు. త్రివిక్రమ్ చెప్పినట్లుగా ఈ చిత్రం ప్రేక్షకులని కూడా మెప్పిస్తుందా లేదా అనేది ఫిబ్రవరి 21న తేలనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios