Asianet News TeluguAsianet News Telugu

'TENET' తెలుగు ట్రైలర్: మరణానంతర జీవితం.. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ మరో ఛాలెంజ్

ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

TENET movie Telugu Trailer
Author
Hyderabad, First Published Mar 13, 2020, 2:52 PM IST

ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. దీనితో హాలీవుడ్ నిర్మాణ సంస్థలన్నీ ఇండియాని టార్గెట్ చేస్తున్నాయి. 

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ చిత్రాలకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. నోలెన్ చిత్రాలని అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఒకసారి నోలెన్ తెరకెక్కించిన సినిమా చూస్తే అతడికి అభిమానిగా మారిపోతారు. అదే నోలెన్ ప్రత్యేకత. సినిమా అర్థం అయినా కాకపోయినా తన టేకింగ్ తో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేస్తాడు. 

ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్, ది డార్క్ నైట్ రైజెస్ లాంటి అద్భుత చిత్రాలు నోలెన్ దర్శత్వంలో వచ్చాయి. ప్రస్తుతం నోలెన్ తెరకెక్కిస్తున్న చిత్రం టెనెట్( TENET). నోలెన్ ప్రతి చిత్రం ప్రేక్షకుడికి సవాలే. కానీ గొప్ప సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తాయి. టెనెట్ చిత్రాన్ని కూడా నోలెన్ అదే విధంగా తెరకెక్కించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తొలిసారి నోలెన్ చిత్రాన్ని ఇండియాలో వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అబ్బురపరిచే విజువల్స్, మెదడుకు పనిచెప్పే విధంగా ఉన్న కంటెంట్ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. 

ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అగ్నిప్రమాదం జరుగుతున్న ఎత్తైన భవంతిలోకి హీరో, మరికొంతమంది రోప్ ల సాయంతో ఎక్కుతారు. ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం కొంతమంది హీరోపై ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగంలో హీరో సక్సెస్ అవుతాడు. దీనిపై బ్యాగ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తుంది. 'ఈ టెస్ట్ లో నువ్వు పాస్ అయ్యావు.. మరణానంతర జీవితానికి స్వాగతం' అనే డైలాగ్ వినిపిస్తుంది. 

మూడో ప్రపంచ యుద్దాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగా హీరో టైంలో వెనక్కి ప్రయాణించబోతున్నట్లు అర్థం అవుతోంది. అణువిధ్వంసం జరగబోతోంది.. లేదు దానికన్నా దారుణం అనే డైలాగ్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్ చివర్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు.. జస్ట్ ఫీల్ అవు అనే డైలాగ్ తో నోలెన్ తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. 

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. నోలెన్ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఇండియాతో పాటు 7 దేశాల్లో చిత్రీకరించారు. ముంబైలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలని కూడా ట్రైలర్ లో చూపించారు. టెనెట్ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియాలో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ పై ఓ లుక్కేయండి.. 

 

Follow Us:
Download App:
  • android
  • ios