సినిమా ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా వస్తున్న మీటూ కామెంట్స్ తగ్గాయి అనుకుంటే ఇటీవల మళ్ళీ ఆ డోస్ పెరిగింది. నార్త్ లో ఇటీవల కొంత మంది నటీమణులు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కటిగా మీడియా ముందు బయటపెడుతున్నారు, హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ దేశాయ్ కూడా  ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నేను కూడా వేధింపులు ఎదుర్కొన్నాను. సురాజ్ అనే వ్యక్తి నన్ను లొంగ ధీసుకోవాలని చూశాడు. 13 ఏళ్ల వయసులో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు క్యాస్టింగ్ కౌచ్ లేకుంటే ఎవరికీ అవకాశాలు రావని సూరజ్ చెప్పాడు. నాకు మొదట్లో సినిమా ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుంటే అవకాశాలు అంత తొందరగా రావు. అయితే సూరజ్ నాకు మాయమాటలు చెప్పి లొంగ దీసుకోవాలని చూశాడు.

 ఒకానొక సమయంలో అతను నాపై లైంగిక దాడి చేయడానికి ప్లాన్ వేశాడు. క్యాస్టింగ్ కాల్ అని చెప్పి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి నాతో తాగించాలని అనుకున్నాడు. ఎవరు లేకపోవడంతో వెంటనే అనుమానం వచ్చి అతని నుంచి తప్పించుకున్నాను. సూరజ్ ఆ తరువాత మళ్ళీ నన్ను కలవలేదు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు' అని రష్మీ దేశాయ్ తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి వివరణ ఇచ్చింది.