Asianet News TeluguAsianet News Telugu

అల్లు అరవింద్ కొత్త లగ్జరీ కారు చూశారా..? కాస్ట్ తో పాటు కారులో ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు..?

న్యూ లగ్జరీ కారుతో మెరుపులు మెరిపిస్తున్నారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. కొత్త కారు ఫీచర్స్ కాని, కారులో టెక్నాలజీ లాంటి విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  

Allu Aravind New Luxury Car Cost Viral In Social Media JMS
Author
First Published Apr 27, 2024, 5:47 PM IST

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు అల్లు అరవింద్.  భారీ సినిమాలతో పాటు.. చిన్న సినిమాలు కూడా నిర్మిస్తూ వస్తున్నారు అరవింద్. ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో తండేల్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉంచితే.. అల్లుఅరవింద్ తాజాగా  లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆయన  బీ.ఎమ్.డబ్ల్యూ ఐ7 బ్రాండ్ కారును కొన్నారు.  

అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులోనే ఈ కారు ఎలక్ట్రిక్ కారు కావడం మరో విశేషం. దీని ధర ఏఖంగా 2 కోట్ల 50 లక్షలని సమాచారం. దాంతో ఈ కారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ కారు ఫీచర్స్ గురించి తెలుసుకుని షాక్అవుతున్నారు. 

జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

ఇక ప్రస్తుతం తండేల్ తో పాటు.. భారీ సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. బన్నీ బోయపాటి శ్రీను  కాంబినేషన్ లో  అల్లు అరవింద్ ఒక సినిమాను ప్లాన్ చేయగా.. ఈ సినిమా ఎప్పుడు ఇప్పట్లో  సెట్స్ మీదకు  వెళ్తుందో లేదో అని  చూడాల్సి ఉంది. బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. అటు బన్నీ పుష్ప2 తో బిజీగా ఉన్నారు. 

ఈరెండు సినిమాలు  పూర్తైన తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. అల్లు అరవింద్ నిర్మాతగా పాన్ ఇండియా హిట్లను సాధించాలని భావిస్తున్నారు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం ఉంటుందని టాలీవుడ్ టాక్. అటు భారీ ప్రాజెక్ట్ లను కూడాఅవరింద్ ప్లనా్ చేస్తున్నారు. రామాయణం సినిమాను బాలీవుడ్ స్టార్స్ తో అరవింద్ రూపొందించబోతున్నట్టు సమాచారం. 

రోజుకు 5 సిగరెట్లు తాగే హీరోయిన్ ఎవరో తెలుసా..? స్వయంగా వెల్లడించిన బాలీవుడ్ బ్యూటీ...?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios