మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరోవైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ఉప్పెన చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. 

ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా వైష్ణవ్ తేజ్ కు ఇండస్ట్రీలోకి స్వాగతం పలికాడు. రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో.. బిగ్ వెల్కమ్ వైష్ణవ్ తేజ్.. ఈ జర్నీ నీకు తప్పకుండా నచ్చుతుంది. పూర్తిగా మనసు పెట్టు అని రామ్ చరణ్ వైష్ణవ్ తేజ్ కు సూచించాడు. 

దర్శకుడు బుచ్చిబాబు, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఉప్పెన చిత్ర విషయానికి వస్తే.. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ కథ అందిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

రెడ్ లిప్స్ తో హాట్ కిస్.. మరోసారి పిచ్చెక్కిస్తున్న ప్రియా వారియర్ వీడియో!

సముద్ర తీరప్రాంతంలో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని బుచ్చి బాబు తెరకెక్కిస్తున్నాడు. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.