బాలీవుడ్ దర్శకుడు ముదస్సర్ అజీజ్ తెరకెక్కించిన 'పతీ పత్ని ఔర్ వో' అనే సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై వివాదాస్పదంగా మారింది. పెళ్లైన హీరో ఆఫీస్ లో మరో అమ్మాయితో ఎఫైర్ సాగించడమనే పాయింట్ దాని చుట్టూ కామెడీతో సినిమాని రూపొందించారు.

అయితే ఈ సినిమా ట్రైలర్ లో మ్యారిటల్ రేప్ గురించి హీరో పెద్ద డైలాగ్ చెబుతాడు. వైఫ్ ని సెక్స్ కోసం బలవంతం చేస్తే రేపిస్ట్ అంటారని ఓ వివాదాస్పద డైలాగ్ హీరో చెప్పడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురయ్యాయి. ఎందరో వివాహితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా డైలాగ్ ఉందని గొడవ చేశారు.

ఓపెనింగ్ డే కలెక్షన్స్.. టాప్ లో మన తెలుగు సినిమాలే (2013-2019)!

దీంతో చిత్రబృందం  ఆ డైలాగ్ ని మ్యూట్ చేసింది. ఈ విషయంపై మాట్లాడిన దర్శకుడు అజీజ్ తన సినిమాలో డైలాగ్ మ్యూట్ చేయడం మారిటల్ రేప్ కి సొల్యూషన్ కాదని అన్నారు. తన అభిప్రాయంలో పన్నెండేళ్ల పిల్లలకు కూడా రేప్ అంటే ఏంటో తెలియాలని.. లేకపోతే వారికి ఏది తప్పో, ఏది ఒప్పో ఎప్పటికీ తెలియవని అన్నారు.

మనం చేయాల్సినవి డైలాగ్స్ ని మ్యూట్ చేయడం కాదని.. అలాంటి సంఘటనలు జరగకుండా అరికట్టాలని అన్నారు. అలానే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ 'హ్యూమన్ సెక్స్ చాలా బాగుంటుందని' డైలాగ్ చెబుతుంది. దీనిపై కూడా విమర్శలు వినిపించడంతో దర్శకుడు అజీజ్.. ఆడవాళ్లకి సెక్స్ నచ్చదా..? అంటూ ప్రశ్నించారు.

సెక్స్ ని అబ్బాయిలు ఎంత ఎంజాయ్ చేస్తారో అమ్మాయిలు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. తన సినిమాలో ఆ డైలాగ్ అమ్మాయి చెప్పిందని ఇంత గొడవ చేస్తున్నారని.. అదే డైలాగ్ అబ్బాయి చెప్పినప్పుడు ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు, అమ్మాయి చెప్పినప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని మండిపడ్డారు.

సినిమా విడుదలైన తరువాత మొత్తం సినిమా చూసి అప్పుడు అభ్యతరాలు, అభిప్రాయలు చెప్పాలే కానీ విడుదలకు ముందే నోటికొచ్చినట్లు మాట్లాడకూడదని అన్నారు. కార్తిక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.