Asianet News TeluguAsianet News Telugu

కథ కోసం రూ.50లక్షలు ఖర్చు చేసిన నాని!

నాచురల్ స్టార్ నాని సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాది మొత్తం బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో కూడా గ్యాప్ తీసుకోకుండా  వరుసగా సినిమాలు చేయబోతున్నాడు.

nani upcoming movie latest update
Author
Hyderabad, First Published Mar 9, 2020, 12:47 PM IST

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాది మొత్తం బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో కూడా గ్యాప్ తీసుకోకుండా  వరుసగా సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పటికే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'V' సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాని నెక్స్ట్ నిన్ను కోరి ఫెమ్ శివ నిర్వాణ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు.

nani upcoming movie latest update

'టక్ జగదీష్' అని టైటిల్ తోనే సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగించిన నాని ఆ సినిమాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ లో ఎక్కువగా కనిపించబోతున్నాడట. ఇక టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ కి రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు 'శ్యామ్ సింగరాయ్' అనే టైటిల్ సెట్ చేసుకున్నాడు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. 'శ్యామ్ సింగరాయ్' కథను నాని 50లక్షలకు  కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఒక ఆడియో కంపెనీలో పని చేసే వ్యక్తి నుంచి నాని ఈ కథను కొనుగోలు చేసినట్లు సమాచారం.

nani upcoming movie latest update

కథ కొత్తగా అనిపించడంతో నాని డబ్బు దగ్గర ఏ మాత్రం ఆలోచించలేదట. మరీ ఆ సినిమాను రాహుల్ ఏ స్థాయిలో రూపొందిస్తాడో చూడాలి.    ఈ మూడు ప్రాజెక్టులతో పాటు మరొక యువ దర్శకుడు చెప్పిన కథకు ఒకే చెప్పినట్లు సమాచారం. మెంటల్ మదిలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన ఒక సాలిడ్ కథను న్యాచురల్ స్టార్ కి వినిపించినట్లు సమాచారం. నానికి కాన్సెప్ట్ నచ్చినప్పటికీ కొంత చేంజెస్ అవసరమని సలహా ఇచ్చాడట. ఈ విధంగా నాని ఈ ఏడాది నాలుగు కథలను సెట్స్ పైకి తెచ్చినట్లు అవుతుంది. మరి ఆ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios